లంచం ఇచ్చినా నేరం, తీసుకున్నా నేరం ఇది మనకు తెలిసిన సూక్తి, కానీ లంచం తీసుకోకుంటే ఇంకా ఘోరం అనే లైన్ ను ఈ సూక్తికి యాడ్ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. నిజాయితీగా బతుకుతానన్న ఆ ఇంజనీర్ ను చచ్చాక నిజాయితీగా ఉండమని ఈ లోకం నుండి శాశ్వతంగా దూరం చేసిన రౌడీల రాజ్యంలో, లంచాన్ని తిరస్కరించినందుకు అతికిరాతకంగా చంపిర కర్కష లోకం లో….. ఏది ఫుణ్యం ఏది పాపం అన్న శ్రీశ్రీ మాటలు గుర్తొస్తున్నాయ్.
సౌరభ్ కుమార్ ఇండియన్ రైల్వేలో ఖరగ్‌పూర్ డిపో చీఫ్ మెటీరియల్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రైల్వే పనుల కోసం ఓ టెండర్ కాల్ చేశారు. ఈ నేపథ్యంలో ఆటెండర్లు తమకే దక్కాలంటూ కొందరు మాఫియా సౌరభ్‌కు లంచం ఇవ్వబోయారు. దీనిని ఆ యువ ఇంజనీర్ తిరస్కరించాడు. దీంతో తెల్లారే సరికి సౌరభ్ తన క్వార్టర్స్ లో రక్తపు మడుగులో పడిఉన్నాడు.అతని శరీరం పై, తలపై బలమైన గాయాలు కూడా ఉన్నాయ్. ఖచ్చితంగా ఇది హత్యేనని, సౌరభ్ తండ్రి, మిత్రులు ఆరోపిస్తున్నారు. సౌరభ్ మృతిపై రైల్వే మంత్రి సురేష్ ప్రభు విచారణకు ఆదేశించారు