చచ్చిన ఎలుకతో వైన్, గబ్బిలాలతో సూప్…. అక్కడ అదే ఆహారం!!

చచ్చిన ఎలుకతో వైన్, గబ్బిలాలతో సూప్… ఏంటి అనుకుంటున్నారా అవును.. అదో ఫుడ్ మ్యూజియం. ప్రపంచంలోని ప్రజల ఆహారపు అలవాట్లు మార్చాలనే ఉద్దేశంతో స్వీడన్ లో ఫుడ్ మ్యూజియంను ఏర్పాటు చేసారు. అక్కడ సాధారణ మనుషులు తినే ఆహారం కనిపించదు. ఆ మ్యూజియంలోకి అడుగు పెట్టగానే మీకు వాంతులు అవ్వడం ఖాయం.
400 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ మ్యూజియంలో పెట్టిన ఈ భయానక ఆహారాన్ని సందర్శకులు ముట్టుకోవచ్చు, వాసన చూడొచ్చు, రుచి కూడా చూడొచ్చు. ప్రపంచంలో ప్రజల ఆహారపు అలవాట్లను మార్చడం కోసమే ఈ మ్యూజియంను ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు.

టూత్ పేస్ట్‌ను తలపించే రూట్ బీర్, కుందేలు తల మాంసం, పాచిపోయిన సోయాబీన్లు, చనిపోయిన ఎలుక పిండాలతో తయారు చేసిన వైన్, ఏళ్ల తరబడి నిలువ ఉంచిన బాతు గుడ్లు, గొర్రె కన్ను జ్యూస్, గబ్బిలం సూప్, పురుగులు పట్టిన చీజ్, ఉడకబెట్టి వేయించిన ముంగీస ఇంకా ఇలాంటివి 80 పైగా భయానక ఆహార పానీయలను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో అడుగు పెట్టిన సందర్శకులు వాంతులు చేసుకోకుండా బయటకు వెళ్లరట. అందుకని.. రోజూ ఎంతమంది సందర్శకులు వాంతులు చేసుకున్నారనే వివరాలను కూడా వారు నోటీసు బోర్డులో పెడతారు.

ఈ మ్యూజియం రోజు తెరిచి ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే తెరుస్తారు.

Tweet:

 

Comments

comments

Share this post

scroll to top