ఆత్మ‌హ‌త్య చేసుకున్న వారి ఆత్మ‌లు స్వ‌ర్గానికి వెళతాాయా?, న‌ర‌కానికా? ఇంట్రస్టింగ్ స్టోరి.

మ‌నుషులు చ‌నిపోతే వారు చేసిన పాపాలు, మూట‌క‌ట్టుకున్న పుణ్యాల ప్ర‌కారం మ‌ర‌ణానంత‌రం వారి ఆత్మ‌లు న‌ర‌కానికో, స్వ‌ర్గానికో పోతాయ‌ని ఆయా మ‌త విశ్వ‌సాల ప్ర‌కారం అంద‌రూ నమ్ముతున్నారు. అయితే ఏదైనా ప్ర‌మాదం వల్లో, వ్యాధి కార‌ణంగానో, స‌హ‌జంగానో మ‌ర‌ణిస్తే అలాంటి వారి ఆత్మ‌లు పైన చెప్పిన విధంగా న‌ర‌కం లేదా స్వ‌ర్గానికి పోతాయ‌ని, అదే ఆత్మ‌హ‌త్య చేసుకున్న వారి ఆత్మ‌లు మాత్రం అలా వెళ్ల‌వ‌ని హిందూ పురాణాలు ప్ర‌త్యేకంగా చెబుతున్నాయి. మ‌రి అలాంట‌ప్పుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న వారి ఆత్మ‌లు ఏమ‌వుతాయి? అస‌లవి ఎక్క‌డికి వెళ్తాయి? ఏం చేస్తాయి? తెలుసుకుందాం రండి.

soul-after-death

హిందూ పురాణాల ప్ర‌కారం ఆత్మ‌హ‌త్య అనేది పాత‌కమైన చ‌ర్య‌న‌ట‌. ఇత‌ర ప‌ద్ధ‌తుల్లో ఏ రకంగా మ‌ర‌ణించినా అది ప్ర‌కృతి స‌హ‌జ సిద్ధంగా సంభ‌వించిన మ‌ర‌ణ‌మే అవుతుంది, కానీ ఆయువు ముగియ‌కుండా బ‌లవంతంగా ప్రాణాలు తీసుకోవ‌డం, ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క్ష‌మించ‌రాని నేరాల‌ని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి. ఆయువు ముగియ‌కుండా ఆత్మ‌హ‌త్య చేసుకుంటే మ‌ర‌ణ‌మ‌నే ప్ర‌క్రియ ఇంకా పూర్తికాన‌ట్టేన‌ట‌.

ఆయువు తీర‌కుండా ఆత్మ‌హ‌త్య చేసుకున్న వారి ఆత్మ‌లు న‌రకం లేదా స్వ‌ర్గానికి వెళ్ల‌వ‌ట‌. వారి ఆత్మలు ‘కామ‌లోకం’ అనే ప్ర‌త్యేక లోకంలో ఇరుక్కుని అక్క‌డే తిరుగుతాయ‌ట‌. అంటే ఒక వ్య‌క్తికి 90 సంవ‌త్స‌రాలు ఆయుష్షు ఉంద‌నుకుంటే వారు 20 ఏళ్ల‌కే ఆత్మ‌హ‌త్య చేసుకుంటే మిగ‌తా 70 సంవ‌త్స‌రాల పాటు కామ‌లోకంలో తిరుగుతూనే ఉంటార‌ట‌. అప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణ‌మ‌నే ప్ర‌క్రియ పూర్తికాద‌ట‌.

అలా కామ‌లోకంలో ఉన్న వారి ఆత్మ‌లు భౌతిక ప్ర‌పంచాన్ని చూడ‌గ‌లుగుతాయ‌ట‌. త‌మ చుట్టూ ఏం జ‌రుగుతుందో వాటికి తెలుస్తుంద‌ట‌. కామ‌లోకంలో ఉన్న ఆత్మ‌ల‌కు రోజు ఒక శిక్ష‌గా గ‌డుస్తుంద‌ట‌. అస‌లు శాంతి అనేదే ఉండ‌ద‌ట‌. మ‌ర‌ణ‌మ‌నే ప్రక్రియ పూర్త‌య్యేవ‌ర‌కు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్టుగానే ఆత్మ‌లు రోజూ ప్ర‌వ‌ర్తిస్తాయ‌ట‌.

ఆత్మ‌ల‌ను చూడ‌గ‌లిగే, వాటితో మాట్లాడ‌గ‌లిగే వారికి ఇలాంటి కామ‌లోక ఆత్మ‌లు హానిని క‌లిగిస్తాయ‌ట‌.

కామ‌లోకంలో మ‌ర‌ణ ప్ర్రక్రియ‌ను పూర్తి చేసుకున్న ఆత్మ‌లు మ‌రు జ‌న్మ కోసం వేరే దేహంలోకి వెళ్తాయ‌ట‌. అయితే ఆ జ‌న్మ మాత్రం వారికి అత్యంత బాధాక‌రంగా ఉంటుంద‌ట‌.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top