అందరి ఫోన్ నంబర్లు మారబోతున్నాయి..! ఎందుకో తెలుసా.? ఇకపై ఎన్ని అంకెలు ఉంటాయంటే.?

మ‌న‌లో చాలా మందికి 10 అంకెలు ఉండే మొబైల్ నంబ‌ర్లే స‌రిగ్గా గుర్తుండ‌వు. అంద‌రి ఫోన్ నంబ‌ర్ల‌ను గుర్తు పెట్టుకునే వారు ఎవ‌రో ఒక్క‌రు మాత్ర‌మే ఉంటారు. అది అంద‌రికీ సాధ్యం కాదు. అయితే ఇక ఇది చాల‌ద‌న్న‌ట్లు ఇప్పుడు ఈ ఫోన్ నంబ‌ర్ల‌లో ఉండే అంకెల సంఖ్య‌ను పెంచ‌నున్నారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఒక‌ప్పుడు ల్యాండ్ లైన్ నంబ‌ర్ల‌లో అద‌న‌పు అంకెల‌ను క‌లిపిట్టుగానే ఇప్పుడు మొబైల్ నంబ‌ర్ల‌కు అద‌న‌పు అంకెల‌ను క‌ల‌ప‌నున్నారు. మ‌రి ఎన్ని అంకెల‌ను అద‌నంగా క‌లుపుతున్నారో తెలుసా..? 3 అంకెల‌ను..!

కేంద్ర టెలికాం శాఖ తాజాగా ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దీని ప్ర‌కారం ఇక‌పై మొబైల్ నంబ‌ర్ల‌లో 10కి బ‌దులుగా 13 అంకెలు ఉంటాయి. అవును, క‌రెక్టే. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి కొత్తగా ఇష్యూ చేసే మొబైల్ నంబ‌ర్ల‌లో 13 అంకెలు ఉంటాయి. ఇక ఇప్ప‌టికే ఉన్న 10 అంకెల ఫోన్ నంబ‌ర్ల‌ను కూడా 13 అంకెలు చేస్తారు. అంటే.. 10 అంకెల‌కు మ‌రో 3 అంకెల‌ను అద‌నంగా క‌లుపుతారు. దీంతో అవి కూడా 13 అంకెల ఫోన్ నంబ‌ర్లు అవుతాయి.

ఈ ఏడాది అక్టోబ‌ర్ 1వ తేదీ నుంచి మొబైల్ వినియోగ‌దారులు వాడే 10 అంకెల ఫోన్ నంబ‌ర్ల‌ను 13 అంకెలకు మార్చ‌నున్నారు. అయితే అంకెలు ముందు క‌లుపుతారా, వెనుక క‌లుపుతారా అన్న‌ది తెలియ‌దు. కానీ 3 అంకెలు మాత్రం 10 అంకెల‌కు క‌లుస్తాయి. ఇక ఈ మార్పు ప్ర‌క్రియ‌కు ఈ ఏడాది డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు గ‌డువు విధించారు. అయితే మొబైల్ నంబ‌ర్ల అంకెల‌లో మార్పుపై ఇప్ప‌టికే బీఎస్ఎన్ఎల్‌, ఎయిర్ టెల్‌లు క‌స‌ర‌త్తు ప్రారంభించాయ‌ట‌. వీటితోపాటు ఇత‌ర టెలికాం ఆప‌రేట‌ర్లు కూడా ఈ ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాయి.

మొబైల్ నంబ‌ర్ల‌లో అంకెల‌ను క‌ల‌ప‌డం ఏమో గానీ జ‌నాల్లో ఇప్పుడు ఆందోళ‌న నెలకొంది. అయితే దీనిపై కంగారు ప‌డాల్సిన ప‌నిలేద‌ని కేంద్ర టెలికాం శాఖ చెబుతోంది. దేశంలో మొబైల్ ఫోన్ల‌ను వాడే వినియోగదారుల‌కు మ‌రింత సెక్యూరిటీని అందించ‌డం కోస‌మే ఇలా అంకెల‌ను మార్పు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే డిసెంబ‌ర్ 31వ తేదీ లోపు మాత్రం పాత ఫోన్ నంబ‌ర్లు కంటిన్యూ అవుతాయ‌ని, కొత్త‌గా అంకెలు క‌లిపి కొత్త నంబ‌ర్‌ను చెప్పినా అది పాత నంబ‌ర్‌నే తీసుకుంటుంద‌ని, కానీ ఆ తేదీ త‌రువాత మాత్రం పూర్తిగా కొత్త నంబ‌ర్లే వాడుక‌లో ఉంటాయ‌ని అధికారులు చెబుతున్నారు.

 

 

మ‌న దేశంలో ప్ర‌స్తుతం 100 కోట్ల ఫోన్ నంబ‌ర్లు ఉన్నాయ‌ని, వాటన్నింటినీ టెలికాం ఆప‌రేట‌ర్లు ఈ ఏడాది డిసెంబ‌ర్‌ 31వ తేదీ లోగా 13 అంకెల‌కు మారుస్తార‌ని కేంద్ర టెలికాం శాఖ చెబుతోంది. అప్ప‌టి వ‌ర‌కు వినియోగదారులు త‌మ నంబ‌ర్‌ను మార్చుకోవాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. ఇక సిమ్‌లు వేసుకునే స‌దుపాయం ఉన్న మెషిన్ టు మెషిన్ ప‌రిక‌రాల్లోనూ ఇలా 13 అంకెల ఫోన్ నంబ‌ర్ విధానాన్ని అమ‌లు చేయ‌నున్నార‌ట‌. ఇదిలా ఉండ‌గా.. న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం ఫోన్ నంబ‌ర్ల‌ను వాడే క‌స్ట‌మ‌ర్ల‌కు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యం నిరాశ‌నే క‌లిగిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీంతో వారు కొత్త‌గా వ‌చ్చే సిరీస్‌కు అనుగుణంగా మ‌ళ్లీ న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం నంబ‌ర్ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది..!

Comments

comments

Share this post

scroll to top