RTC బస్సుల్లో ఫ్రీ వైఫై…!? మరికొన్ని రోజుల్లో…హైద్రాబాద్ లో అమలు.

ఇంట్లో ఉంటే బ్రాడ్‌బ్యాండ్ ఇంట‌ర్నెట్ ద్వారా వైఫై… ఆఫీసుకో, కాలేజీకో వెళ్తే అక్క‌డా వైఫై… రైల్వే స్టేష‌న్‌, బ‌స్టాండ్‌కు వెళ్తే అక్క‌డ కూడా వైఫై… అంతేకాదు ఇప్పుడు మ‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌లు బ‌హిరంగ ప్ర‌దేశాల్లోనూ వైఫై ద్వారా ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం ల‌భిస్తోంది. దీంతో స‌హ‌జంగానే మొబైల్ డేటా వినియోగం కొంత త‌క్కువైంది. కానీ దేని ఉప‌యోగం దానిదే క‌దా. ఇక్క‌డి వ‌ర‌కు అంతా బాగానే ఉంది, మ‌రి ఒక వేళ మొబైల్‌లో వాడుతున్న ఇంట‌ర్నెట్ డేటా స‌డెన్‌గా అయిపోతే..? అప్పుడు మీరు సిటీలో ఏ బ‌స్సులోనో ప్ర‌యాణిస్తుంటే..? అర్జంట్‌గా ఇంట‌ర్నెట్ అవ‌స‌రం ఉంటే..? అదిగో అలాంటి ఇబ్బందులను తొల‌గించ‌డానికే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఆర్‌టీసీ అధికారులు న‌డుం బిగించారు.

wifi-in-rtc-bus

ఇక‌పై హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసులు ఏసీ బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తే వైఫై ద్వారా ఉచిత ఇంట‌ర్నెట్‌ను వాడుకోవ‌చ్చు. సిటీలో ఉన్న దాదాపు 115 ఏసీ బ‌స్సుల్లో ఈ సౌల‌భ్యం అందుబాటులోకి రానుంది. మ‌రో వారంలో వైఫై అమ‌ర్చిన ఏసీ బ‌స్సులు రోడ్ల‌పైకి ఎక్క‌నున్నాయి. అయితే బ‌స్సుల్లో ప్ర‌యాణించేవారు మొద‌టి 25 నిమిషాల వ‌ర‌కు వైఫైని ఉచితంగా వాడుకోవ‌చ్చు. అనంత‌రం కూడా కావాలంటే నామ‌మాత్ర‌పు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితేనేం చాలా అర్జంటుగా ఇంట‌ర్నెట్ అవ‌స‌రం ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేసే అంశం.

నగ‌ర ఏసీ బ‌స్సుల్లో వైఫై ప‌రిక‌రాల‌ను అమ‌ర్చేందుకు గాను రూర‌ల్ ఇండియా అనే సంస్థ జీహెచ్ఎంసీ ఆర్‌టీసీ అధికారుల‌తో క‌ల‌సి ప‌నిచేయ‌నుంది. ఈ క్ర‌మంలో వారు వైఫై సెట్ల‌ను బ‌స్సుల్లో అమ‌ర్చ‌గానే వాటిలో వైఫై ను ఎలా వాడుకోవాలో ప‌లు సూచ‌న‌ల‌తో కూడిన బోర్డుల‌ను కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా ఈ వైఫై సౌకర్యాన్ని ఏసీ బ‌స్సుల వ‌ర‌కే ప‌రిమితం చేస్తారా..? లేదంటే అన్ని బ‌స్సుల్లోనూ వైఫై క‌ల్పిస్తారా.? అనేది వేచి చూస్తే తెలుస్తుంది. జ‌నాల‌కు మ‌రింత సౌక‌ర్యాల‌ను అందించాలంటే న‌గ‌రంలోని అన్ని సిటీ బ‌స్సులే కాదు, అన్ని జిల్లాల్లోనూ ఉన్న ఆర్‌టీసీ బ‌స్సుల్లోనూ ఇలాంటి వైఫై స‌దుపాయాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడు ఇంకా ఎక్కువ మందికి ఉప‌యోగంగా ఉంటుంది.

14285765_1228454377177150_1486519637_o

Comments

comments

Share this post

scroll to top