ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇస్తే… ఇకపై మీ ఇంటి వ‌ద్ద‌కే పెట్రోల్‌, డీజిల్ తెచ్చి ఇస్తారు..!

మ‌న దేశంలో ఉన్న ప్ర‌ధాన న‌గ‌రాల‌తోపాటు ప‌ట్ట‌ణాల్లోనూ నేటి త‌రుణంలో పెట్రోల్ బంకుల్లో ర‌ద్దీ ఏ విధంగా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. పెట్రోల్‌, డీజిల్… ఇంధ‌నం ఏదైనా దాన్ని వాహ‌నాల్లో నింపుకునేందుకు వాహ‌న‌దారులు కిలోమీట‌ర్ల మేర బారులు తీరుతుంటారు. ఈ క్ర‌మంలో వెళ్లాల‌నుకునే గమ్య‌స్థానానికి ఆల‌స్య‌మ‌వుతూ ఉంటుంది. దీంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తూ ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లోనైతే అస‌లు పెట్రోల్ బంకుల్లోకి వెళ్దామంటేనే వీలు కానంత ర‌ద్దీ ఉంటుంది. అయితే ఇక‌పై వాహ‌న‌దారుల‌కు ఇలాంటి ఇబ్బందులు త‌ప్ప‌నున్నాయి. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇంత‌కీ అసలు విష‌యం ఏమిటంటే…

మీరు ఇక‌పై మీ వాహ‌నానికి ఇంధ‌నం కావాలంటే పెట్రోల్ బంకు దాకా వెళ్లాల్సిన ప‌నిలేదు. పెట్రోల్‌, డీజిల్‌… ఇంధ‌నం ఏదైనా మీ ఇంటి వ‌ద్ద‌కే డోర్ డెలివ‌రీ కానుంది. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఆన్‌లైన్ ఈ-కామ‌ర్స్ సైట్ల‌లో మ‌నం వ‌స్తువుల‌ను కొనుగోలు చేసిన‌ట్టు ఇక‌పై పెట్రోల్‌, డీజిల్ కూడా మ‌న‌కు ఆ వ‌స్తువుల్లాగే ఆన్‌లైన్ ద్వారా డోర్ డెలివ‌రీ కానున్నాయి. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఓ వినూత్న ఆలోచ‌న చేసింది. త్వ‌ర‌లోనే ఈ విధానం అమ‌లులోకి రానుంది.

దీని వల్ల మ‌న‌కు ఎంతో స‌మ‌యం ఆదా అవుతుంది. 24 గంట‌ల్లో ఎప్పుడైనా పెట్రోల్‌, డీజిల్ ఆర్డ‌ర్ చేస్తే వాహ‌న‌దారుల ఇంటి వ‌ద్ద‌కే స‌ద‌రు బంక్ సిబ్బంది పెట్రోల్‌, డీజిల్‌ను తీసుకువ‌చ్చి మ‌న‌కు కావాల‌నుకున్న మొత్తాన్ని డెలివ‌రీ చేస్తారు. అయితే మ‌నం ముందుగానే ఆన్‌లైన్‌లో డ‌బ్బులు చెల్లించ‌వ‌చ్చు. లేదంటే క్యాష్ ఆన్ డెలివ‌రీ కూడా ఇవ్వ‌వ‌చ్చు. దీంతో మ‌న‌కు చాలా స‌మ‌యం ఆదా కానుంది. ఉద‌యాన్నే ఆఫీసుల‌కు వెళ్లేవారు మార్గ‌మ‌ధ్య‌లో బంక్ వ‌ద్ద ఎక్కువ సేపు నిరీక్షించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఉద‌యం లేవ‌గానే ఇంధ‌నం ఆర్డ‌ర్ ఇస్తే ఆఫీసుకి వెళ్లేలోపు అది వ‌చ్చేస్తుంది. దీంతో స‌మయం ఆదా అవుతుంది. అయితే ఈ విధానాన్ని ఎప్పటి నుంచి అమ‌లులోకి తెస్తారో తెలియదు. కానీ వీలున్నంత త్వ‌ర‌గానైతే అందుబాటులోకి తెస్తార‌ట‌. నిజంగానే ఈ ఆలోచ‌న చాలా బాగుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top