ఇక‌పై పెట్రోల్ బంకులు కేవ‌లం 12 గంట‌ల పాటు మాత్ర‌మే తెరిచి ఉంటాయి తెలుసా..? టైమింగ్స్ ఏంటో చూడండి..!

మే నెల నుంచి పెట్రోల్ బంకుల‌ను ఆదివారం పూట మూత పెట్ట‌నున్న విష‌యం విదితమే. మే 14వ తేదీ నుంచి ఈ కొత్త రూల్ అమ‌లులోకి రానుంది. ఇప్ప‌టికే ఇందుకు గాను పెట్రోల్ బంకులు రెడీ అయ్యాయి. అయితే తాజాగా వాహ‌న‌దారుల నెత్తిన మ‌రో పిడుగు లాంటి వార్త ప‌డింది. అదేమిటంటే… ఇక‌పై పెట్రోల్ బంకుల‌ను కేవ‌లం 12 గంట‌ల పాటు మాత్ర‌మే తెర‌చి ఉంచుతార‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. త్వ‌ర‌లో ఈ నిబంధ‌న‌ను అమ‌లు చేయ‌నున్నారు. ఇంత‌కీ… అస‌లు విష‌యం ఏమిటంటే…

పెట్రోలియం సంస్థ‌ల నుంచి త‌మ‌కు క‌మిష‌న్‌, మార్జిన్ వంటివి పెంచాల‌ని డిమాండ్ చేస్తూ పెట్రోలియం డీల‌ర్లు, బంకుల య‌జ‌మానులు ఇప్ప‌టికే ఆదివారం పూట బంక్‌ల‌ను మూత పెట్టాల‌ని నిర్ణ‌యించారు క‌దా. అయితే అలా తాము పాటిస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ పెట్రోలియం సంస్థ‌ల నుంచి ఎలాంటి స్పంద‌నా లేదు. దీంతో మ‌రో షాకింగ్ లాంటి నిర్ణ‌యం తీసుకున్నారు. మే 10వ తేదీ నుంచి పెట్రోలియం సంస్థ‌ల నుంచి కొనుగోళ్లు నిలిపివేస్తామ‌ని డీల‌ర్లు చెబుతున్నారు. దీనికి తోడు మే 15వ తేదీ నుంచి ఉద‌యం 6 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు అంటే కేవ‌లం 12 గంట‌ల పాటు మాత్ర‌మే పెట్రోల్, డీజిల్ అమ్ముతామ‌ని, మిగిలిన 12 గంట‌ల పాటు బంక్‌ల‌ను మూసి వేస్తామ‌ని వారు చెబుతున్నారు.

తొలుత ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలో ఈ నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌నున్నారు. ఆ త‌రువాత కూడా పెట్రోలియం సంస్థ‌లు దిగిరాక పోతే ఇక దేశ వ్యాప్తంగా ఇదే నిర్ణ‌యాన్ని అమ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు డీల‌ర్లు. అదే జ‌రిగితే ఇక వాహ‌న‌దారులు ఎప్పుడు ప‌డితే అప్పుడు ఇంధ‌నం నింపుకుంటామంటే కుద‌ర‌దు. కేవ‌లం ప‌గ‌టి పూట మాత్ర‌మే ఆ ప‌నిచేయాలి. రాత్రి వేళ ప్ర‌యాణం ఉంటే ప‌గ‌టి పూట ఇంధ‌నం నింపి పెట్టుకోవాలి. లేదంటే ప్ర‌యాణం క్యాన్సిల్ చేసుకోవాల్సి వ‌స్తుంది. ఇక స‌రుకు ర‌వాణా చేసే ట్రాన్స్‌పోర్టు వాహ‌నాల ప‌రిస్థితి మ‌రీ ద‌య‌నీయంగా మారుతుంది. అప్పుడు నిత్యావ‌స‌రాలు, కూర‌గాయల ధ‌ర‌లు కూడా పెరిగే అవ‌కాశం ఉంటుంది. ఏది ఏమైనా… ఈ నిర్ణయం మాత్రం వాహ‌న‌దారుల‌కు షాకింగ్ న్యూసే..!

Comments

comments

Share this post

scroll to top