త్వ‌ర‌లో మ‌న సైనికుల‌కు ఏసీ జాకెట్ల‌ను అందిస్తార‌ట తెలుసా..?

ప‌గ‌ల‌న‌క‌, రాత్ర‌న‌క తీవ్ర‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను త‌ట్టుకుని సైనికులు మ‌న దేశానికి, మ‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తారు. ఎంత‌టి ఎండ ఉన్నా, చ‌లి ఉన్నా, వ‌ర్ష‌మైనా వారు త‌ప్ప‌నిస‌రిగా విధి నిర్వ‌హ‌ణ‌లో ఉంటారు. అయితే కొన్ని సార్లు ప్ర‌త్యేక ఆప‌రేష‌న్లు చేసిన‌ప్పుడు లేదంటే వారి రోజువారీ వ్యాయామ కార్య‌క్ర‌మాల్లో భాగంగా వారి శ‌రీరం హీట్‌న‌కు గుర‌వుతుంటుంది. దీంతో సైనికుల‌కు చాలా అసౌక‌ర్యం క‌లుగుతుంది. అయితే దీన్ని నివారించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ఓ నిర్ణ‌యం తీసుకుంది. అదేమిటంటే…

భార‌త ఆర్మీలో స్పెష‌ల్ ఫోర్సెస్ విభాగంలో ప‌నిచేసే కార్మికుల‌కు త్వ‌ర‌లో ఎయిర్ కండిష‌న్డ్ (ఏసీ) జాకెట్ల‌ను ప్ర‌త్యేకంగా ఇవ్వ‌నున్నారు. వీటి వ‌ల్ల శ‌రీరం ఎంత‌టి వేడికి గురైనా లోప‌ల చ‌ల్ల‌గా ఉంటుంది. క‌నుక అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ జాకెట్ల‌కు సంబంధించిన ట్ర‌య‌ల్ ర‌న్ న‌డుస్తోంది. అతి త్వ‌ర‌లోనే వీటిని సైనికుల‌కు అంద‌జేయ‌నున్నారు.

అయితే ఇటీవ‌లే సైనికుల‌కు ప్రత్యేక‌మైన హెల్మెట్‌ల‌ను అంద‌జేశారు గుర్తుంది క‌దా. ఆ హెల్మెట్ల వ‌ల్ల పెద్ద తుపాకీ నుంచి వచ్చే తూటాలు కూడా సైనికుల‌ను ఏమీ చేయ‌లేవు. దీంతో సైనికుల‌కు ఎంతో ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలోనే సైనికుల కోసం కొత్త‌గా ప్ర‌త్యేక‌మైన ఏసీ జాకెట్ల‌ను కూడా అందివ్వ‌నున్నారు. దీంతో వారికి చాలా సౌక‌ర్యంగా ఉంటుంది. ముఖ్యంగా స్పెష‌ల్ ఆప‌రేష‌న్స్ చేసిన‌ప్పుడు శ‌రీరం నుంచి విడుద‌ల‌య్యే హీట్‌ను ఇవి కంట్రోల్ చేస్తాయి. దీంతో ఆప‌రేష‌న్‌లో సైనికులు మ‌రింత చురుగ్గా పాల్గొన‌గ‌లుగుతారు. సైనికుల‌కు ఇలాంటి ఏసీ జాకెట్ల‌ను అందిస్తుండ‌డం నిజంగా శుభ ప‌రిణామ‌మే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top