మీరు ఏదైనా స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారా ? లేదంటే కొత్తగా ఏదైనా స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయాలని చూస్తున్నారా ? అయితే నిధుల కోసం ఏ బ్యాంకులో పడితే ఆ బ్యాంకులో ఖాతాను ఓపెన్ చేయకండి. కేంద్రం సూచించిన బ్యాంకుల్లోనే ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇకపై దేశంలో ఉన్న ఏ స్వచ్ఛంద సంస్థ అయినా కేంద్రం విడుదల చేసిన జాబితాలో ఉన్న ఏదైనా బ్యాంకులో మాత్రమే ఖాతాలను ఓపెన్ చేయాలి. అందులోకి వచ్చే నిధులనే వాడాల్సి ఉంటుంది. ఇక ఆ బ్యాంకులు జాబితా ఏమిటంటే…
అబూదబీ కమర్షియల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, ద కాస్మస్ కో ఆపరేటివ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, తమిళనాడు మెర్సటైల్ బ్యాంక్ లిమిటెడ్, ద క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్, సిటీ యూనియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ద జమ్మూ కశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలహాబాద్ యూపీ జర్మన్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్ లిమిటెడ్, మణిపూర్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, విజయ బ్యాంక్, బాంబే మెర్సంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఎస్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, యాక్సిస్ బ్యాంక్.
పైన సూచించిన బ్యాంకుల్లో మాత్రమే స్వచ్ఛంద సంస్థలు ఖాతాలను ఓపెన్ చేయాలి. వాటిల్లోనే లావాదేవీలను నిర్వహించాలి. తప్పితే వేరే బ్యాంకుల్లో ఖాతాలను ఓపెన్ చేయడానికి లేదు. అయితే కేంద్రం ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందో తెలుసా..? కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నాయని, వాటిని ఆ సంస్థలు చట్ట వ్యతిరేక పనులకు వాడుతున్నాయని కేంద్రానికి తెలిసిందట. అందుకనే అలా జరగకుండా ఉండేందుకు ఈ కొత్త రూల్ను కేంద్రం అమలు చేస్తుంది. ఇదీ.. ఈ రూల్ వెనుక ఉన్న అసలు నిజం..!