అవును మరి. టెక్నాలజీ మారుతున్న కొద్దీ పాత వస్తువులు పాతవే అవుతాయి. వాటి స్థానంలో కొత్తవి వచ్చి చేరుతాయి. ప్రారంభంలో కొంత కష్టమైనా జనాలు నెమ్మదిగా వాటికి అలవాటు పడిపోతారు. అయితే ఇప్పుడు అలాంటి స్థితే ఎంపీ3 పాటలకు కూడా వస్తుందా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఎంపీ3 అనేది ఇప్పటి టెక్నాలజీ కాదు, చాలా పాతది 1990లలో వచ్చిందది. ఈ క్రమంలో అప్పట్లో సీడీలు, డీవీడీల్లో, ఎంపీ3 ప్లేయర్లలో ఎంపీ3 పాటలను వినేవారు. దాదాపుగా ఇప్పటికీ చాలా మంది స్మార్ట్ఫోన్లలోనూ ఎంపీ3 ఫార్మాట్లో ఉన్న పాటలనే వింటున్నారు. కానీ ఇకపై ఎంపీ3 మనకు కనిపించదు. దాన్ని క్రియేట్ చేసిన Fraunhofer IIS అనే సంస్థ ఎంపీ3 శాశ్వతంగా మూతపడనున్నట్టు ప్రకటించింది. దీంతో ఇప్పుడు యూజర్లంతా సోషల్ మీడియాలో ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు.
అయితే ఇకపై మనకు ఎక్కడా ఎంపీ3 ఫార్మాట్లో ఉన్న పాటలు, ఆడియో ఫైల్స్ కనిపించవన్నమాట. మరి అవి లేకపోతే ఎలా..? పాటలను ఎలా వినాలి..? అంటే… అందుకు పరిష్కారం ఉంది. ఎంపీ3 లేకున్నా దానికన్నా ఎన్నో రెట్లు క్వాలిటీ కలిగిన సంగీతాన్ని ఇచ్చే ఫైల్ ఫార్మాట్లను ఇప్పటికే డెవలప్ చేశారు. త్వరలో ఇక అవే మనకు దర్శనమివ్వనున్నాయి. దీంతో అప్పటి వరకు ఎంపీ3 పాటల శకం ముగుస్తుంది. ఇంతకీ అసలు ఆ కొత్త రకం ఫార్మాట్లు ఏవి అనే కదా.. మీ డౌట్..! అవేమిటంటే… AAC, AC3, MP4. ఇవే ఇవే కాకుండా మరిన్ని ఫార్మాట్లను కూడా ఎంపీ3కి ఆల్టర్నేటివ్గా డెవలప్ చేస్తున్నారు.
త్వరలో మనం ఇక సీడీలు, డీవీడీ, పెన్‌డ్రైవ్‌లు వంటి వాటిలోనే కాదు, స్మార్ట్ఫోన్లు, ఆడియో ప్లేయర్లు, హోమ్ థియేటర్ సిస్టమ్‌లలోనూ ఎంపీ3 ఫార్మాట్‌కు చెందిన పాటలను ప్లే చేయలేం. అందుకు బదులుగా పైన చెప్పిన ఆడియో ఫార్మాట్లలో ఉన్న ఫైల్స్‌ను ప్లే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే టెక్నాలజీతో పోటీ పడి పరుగులు పెట్టే వారికి ఇలా ఎంపీ3 నుంచి ఇతర ఫార్మాట్లలోకి మారడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ దాని గురించి తెలియని వారికే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే ఉన్న ఎంపీ3 పాటలను అన్నింటినీ పైన చెప్పిన ఫార్మాట్లలోకి కన్వర్ట్ చేసుకుని ఫోన్లు, ఇతర డివైస్‌లలో వేసుకోవాలంటే చాలా ఇబ్బందే. చూద్దాం.. మరి ఏమవుతుందో..!