గూగుల్ మ్యాప్స్‌లో త్వ‌ర‌లో రానున్న మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ ఫీచ‌ర్ ఇది తెలుసా..?

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ ఎన్నో యాప్‌ల ద్వారా మొబైల్‌, కంప్యూట‌ర్ వినియోగ‌దారుల‌కు సేవ‌ల‌ను అందిస్తోంది. గూగుల్‌కు చెందిన ఎన్నో యాప్స్ ఇప్పుడు ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ల‌లో మ‌న‌కు ల‌భిస్తున్నాయి. అయితే గూగుల్ అందిస్తున్న ప్ర‌ధానమైన ఫీచ‌ర్ల‌లో ఒక‌టి గూగుల్ మ్యాప్స్‌. ఇందులో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త అప్‌డేట్స్ వ‌స్తూనే ఉన్నాయి. కొత్త ఫీచ‌ర్ల‌ను గూగుల్ అందిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ ఫీచ‌ర్ ను గూగుల్ త‌న మ్యాప్స్ అప్లికేష‌న్‌లో అందుబాటులోకి తేనుంది. అదేమిటంటే…

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ త్వరలో మరో ఫీచర్ ను తన వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. మ్యాప్స్ అప్లికేషన్‌లో కొత్తగా అందజేయనున్న ఫీచర్ ద్వారా యూజర్లు జర్నీలో ఉన్నప్పుడు రియల్‌టైం నోటిఫికేషన్లను పొందవచ్చు. అయితే యాప్‌లో ముందుగా యూజర్లు తమ ప్రయాణ వివరాలను, తాము వెళ్లే రూట్ సమాచారాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆ దారిలో యూజర్ వెళ్లేటప్పుడు మ్యాప్స్ యాప్ రియల్ టైం నోటిఫికేషన్లను ఇస్తుంది.

అయితే ఒక వేళ ఆ మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్లినా యాప్ నోటిఫికేషన్లను పంపుతుంది. దగ్గర్లో ఉన్న బస్ స్టాప్, రైల్వే స్టేషన్ వంటి వివరాలను నోటిఫికేషన్ రూపంలో మ్యాప్స్ అప్లికేషన్ యూజర్‌కు పంపుతుంది. దీంతో ఆ నోటిఫికేషన్లు యూజర్ సెట్టింగ్స్‌ను బట్టి ఫోన్ లాక్ స్క్రీన్‌పై కూడా కన్పిస్తాయి. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను గూగుల్ అంతర్గతంగా పరిశీలిస్తోంది. త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త అప్‌డేట్ రూపంలో ఈ ఫీచర్ లభించనుంది.

Comments

comments

Share this post

scroll to top