“రైల్వే టికెట్” బుకింగ్ ఇకపై సింపుల్ కాదు..! తప్పనిసరిగా “ఆధార్” నెంబర్ ఇవ్వాల్సిందే…!

మన దేశంలో రైళ్ల‌లో ప్ర‌యాణం చేసేందుకు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటే అందుకు ఎంత ఇబ్బంది ప‌డ‌తామో అంద‌రికీ తెలిసిందే. మ‌నం కావాల‌నుకున్న ట్రెయిన్‌కు అప్ప‌టికప్పుడు టిక్కెట్లు కావాలంటే దొర‌క‌వు, త‌త్కాల్‌పై ఆధార ప‌డాలి. లేదంటే చాలా రోజుల ముందే రిజ‌ర్వేష‌న్ చేయించుకోవాలి. అయితే అలా ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ గురించి ప‌క్క‌న పెడితే త‌త్కాల్ లో టిక్కెట్లు దొర‌క‌డం చాలా క‌ష్టం. అందుకు కార‌ణం ద‌ళారీలు. కానీ… త్వ‌రలో ఆ బాధ కూడా ఇక మ‌న‌కు తీర‌నుంది. ఎందుకంటే రైల్వే శాఖ వారు త్వ‌ర‌లో ఓ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్ట‌నున్నారు.

aadhar-irctc

రైల్వేశాఖ వారు త్వ‌ర‌లో టిక్కెట్ బుకింగ్ కోసం ఆధార్ కార్డ్ నంబ‌ర్‌ను త‌ప్ప‌నిస‌రి చేయ‌నున్నారు. దీంతో ఎవ‌రు ప‌డితే వారు, ఎన్ని ప‌డితే అన్ని టిక్కెట్ల‌ను కొంటామంటే కుద‌ర‌దు. అందుకు ప‌రిమితి ఉంటుంది. దీంతోపాటు ద‌ళారీల ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట కూడా వేయ‌వ‌చ్చు. అయితే టిక్కెట్లు ఐఆర్‌సీటీసీలో కొనుగోలు చేసే వారు మాత్రం త‌మ ఆధార్ నంబ‌ర్‌ను ఓ సారి ఆ అకౌంట్‌కు లింక్ చేస్తే చాలు. ఆపై ఎప్పుడు టిక్కెట్లు బుక్ చేసుకున్నా ఆటోమేటిక్‌గా ఆ టిక్కెట్ల‌కు ఆధార్ లింక్ అవుతుంది. కానీ రైల్వే రిజ‌ర్వేష‌న్, ఇత‌ర ట్రావెల్స్ ద్వారా చేసుకునే వారు అప్ప‌టిక‌ప్పుడు ఆధార్ నంబ‌ర్ల‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

రైల్వే శాఖ త్వ‌ర‌లో అందుబాటులోకి తేనున్న ఈ ఆధార్ లింకింగ్ ద్వారా సామాన్య జ‌నాల‌కు టిక్కెట్ రిజర్వేష‌న్ క‌ష్టాలు తీర‌నున్నాయి. అయితే దీంతోపాటుగా మ‌రో కొత్త టిక్కెటింగ్ యాప్‌ను కూడా రైల్వే అధికారులు విడుద‌ల చేయ‌నున్నారు. అందుకు మే నెల వ‌ర‌కు ఆగాలి. ఈ క్ర‌మంలో ఐఆర్‌సీటీసీలో ఆధార్‌ను లింక్ చేసుకునేందుకు గాను వినియోగ‌దారుల కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను కూడా ఇప్ప‌టికే రూపొందించిన‌ట్టు తెలిసింది. మ‌రి ఈ ఆధార్ లింకింగ్ ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి వ‌స్తుందో వేచి చూడాలి.

Comments

comments

Share this post

scroll to top