ఇకపై రోజుకు 5 ఆటలు….మ్యాట్నీ టు ఫస్ట్ షో….మధ్యలో ఇంకో షో..!!

ఇండ‌స్ట్రీ ప‌రంగా చెప్పాలంటే సినిమాలు పెద్ద‌వి, చిన్న బ‌డ్జెట్‌వి అని రెండు ర‌కాలు ఉంటాయి. కానీ ఏ సినిమానైనా ప్రేక్ష‌కుల‌కు ఒక్క‌టే. మంచి క‌థ, క‌థ‌నం, ఇత‌ర‌త్ర అంశాలు… ఉండాలే గానీ సినిమా పెద్దది, చిన్న‌ది… అని ప్రేక్ష‌కులు చూడ‌రు. దేన్నయినా ఆద‌రిస్తారు. ఈ విషయం గురించి గ‌తంలో మ‌నం ఎన్నో సార్లు తెలుసుకున్నాం. ఆ క్ర‌మంలోనే పెద్ద సినిమాల‌ను కూడా కాద‌ని, అనేక చిన్న సినిమాల‌ను ప్రేక్ష‌కులు హిట్ చేశారు. వాటికి అఖండ విజ‌యాల‌ను కూడా అందించారు. అయితే నిజానికి చెప్పాలంటే చిన్న సినిమాల‌కు ఉండే క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్ర‌ధానంగా థియేట‌ర్లు దొర‌క‌వు..!

cinema-theatre
పెద్ద సినిమాలు ఏవీ లేక‌పోతే అది వేరే. కానీ ఏవైనా పెద్ద సినిమాలు విడుద‌ల‌వుతున్నాయంటే మాత్రం చిన్న సినిమాల‌ను వాటి త‌రువాత నెల రోజుల‌కు విడుద‌ల చేసుకోవాల్సిందే. ఎందుకంటే థియేట‌ర్లు అస్స‌లు దొర‌క‌వు. దీంతో అనేక మంది చిన్న సినిమా నిర్మాత‌లు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. ఇవ‌న్నీ మ‌న‌కు తెలిసిన విష‌యాలే. అయితే తెలంగాణ‌లో ఇక‌పై చిన్న సినిమా నిర్మాత‌ల క‌ష్టాలు దూరం కానున్నాయి. ఎందుకంటే…

ఇక‌పై తెలంగాణ‌లో ఉన్న అన్ని థియేట‌ర్ల‌లో 5వ ఆట ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఆ ఆట‌ను చిన్న సినిమాల‌కే కేటాయించాల‌ని నిర్ణ‌యించారు. అతి త్వ‌ర‌లో ఇది అమ‌లులోకి రానుంది. అయితే ఆ 5వ ఆట అనేది ఎప్పుడు వేస్తార‌నేదే ఇప్పుడు త‌లెత్తుతున్న ప్ర‌శ్న‌. ఎందుకంటే సాధార‌ణంగా ఏ థియేట‌ర్‌లో అయినా ఉద‌యం 11, 12 గంట‌ల‌కు మార్నింగ్ షో ప్రారంభ‌మ‌వుతుంది, అనంత‌రం రాత్రి 9, 10 గంట‌ల‌కు సెకండ్ షోతో ముగుస్తుంది. దాని త‌రువాత 5వ ఆట‌ను వేయ‌డం వీలు కాదు. క‌నుక ఉద‌యం 8, 9 గంట‌ల‌కే 5వ ఆటను ముందుగా వేయాల్సి ఉంటుంది. అది క‌నుక అమ‌లులోకి వ‌స్తే మొద‌ట చిన్న సినిమా ఆట‌తో మొద‌లైన షోలు, నైట్ వ‌ర‌కు ముగుస్తాయి. ఈ క్ర‌మంలో 5వ ఆట నిర్ణ‌యం వ‌ల్ల సినిమా థియేట‌ర్ య‌జ‌మానుల‌కు కూడా బెనిఫిటే ఉంటుంద‌నేది విశ్లేష‌కుల మాట‌. అస‌లే నోట్ల ర‌ద్దు క‌ష్టాల‌తో అర‌కొర‌గా ప్రేక్ష‌కులతో హాల్స్ య‌జ‌మానులు ఈగ‌లు తోలుకుంటున్న ప‌రిస్థితి ఇప్పుడు నెల‌కొంది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణయంతో క‌రెన్సీ క‌ష్టాల నుంచి కొంతలో కొంతైనా థియేట‌ర్ య‌జ‌మానుల‌కు, త‌ద్వారా సినీ నిర్మాత‌ల‌కు, న‌టుల‌కు ఊర‌ట ల‌భించే అవ‌కాశం ఉంది..!

Comments

comments

Share this post

scroll to top