క్రెడిట్ కార్డుల‌ను వాడుతున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్…!

ఎవ‌రైనా ఎవ‌రి ద‌గ్గ‌రైనా, ఏ సంస్థ ద‌గ్గ‌రైనా అప్పు తీసుకుంటే వ‌డ్డీ క‌చ్చితంగా క‌డ‌తారు క‌దా. అవును, క‌ట్టాల్సిందే. మ‌రి ఆ అప్పు, దానికి క‌ట్టే వ‌డ్డీకి కొస‌రుగా మ‌ళ్లీ కొంత డ‌బ్బు క‌ట్టాల్సి వ‌స్తే. అంటే.. అప్పు, వ‌డ్డీ ఈ రెండింటి మీద చార్జిల‌తో బాదితే. ఇక అంత‌క‌న్నా దుర‌దృష్టం ఇంకోటి ఉండ‌దు క‌దా. అవును, ఉండ‌దు. త్వ‌ర‌లో… అంటే మ‌రికొన్ని రోజుల్లో అదే జ‌ర‌గ‌నుంది. ఇంకా అర్థం అవ‌డం లేదా..? అదేనండీ… జూలై 1 నుంచి కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా జీఎస్‌టీ బిల్లును అమ‌లు చేయ‌నుంది క‌దా. అవును, దాంతోనే ఈ చార్జి ప‌డ‌నుంది. ఇంత‌కీ అవి ఎవ‌రిపై అంటే..

ఇంకెవ‌రిపై… క్రెడిట్ కార్డుల‌ను వాడే వారిపై. క్రెడిట్ కార్డులు అంటేనే అప్పు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ‌లు క‌స్ట‌మ‌ర్ స్థోమ‌త‌కు అనుగుణంగా కార్డు రూపంలో ఇచ్చే అప్పు.. దాన్నే క్రెడిట్ కార్డు అంటారు. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా క‌స్ట‌మ‌ర్ కార్డును వాడితే దానికి స‌ద‌రు బ్యాంకు నెల నెలా బిల్లును పంపుతుంది. దాంతో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు 15 శాతం స‌ర్వీస్ టాక్స్‌ను కూడా వ‌సూలు చేస్తూ వ‌చ్చారు. నిజానికి ఈ బిల్లుల‌కు 15 శాతం టాక్సే ఎక్కువ‌. అయితే ఇక‌పై అది 18 శాతం కానుంది.

త్వ‌ర‌లో అమ‌లు కానున్న జీఎస్‌టీ బిల్లు వ‌ల్ల క్రెడిట్ కార్డుల‌ను వాడే వారు త‌మ బిల్లుకు అద‌నంగా మ‌రో 18 శాతం స‌ర్వీస్ ట్యాక్స్‌ను చెల్లించాల్సిందే. ఇప్ప‌టికే స‌ద‌రు ట్యాక్స్ 15 శాతంగా ఉంది. తీసుకునే అప్పుకు గాను చెల్లించే వ‌డ్డీకి తోడు, ఆ ట్యాక్స్‌ను కూడా క‌స్ట‌మ‌ర్లు క‌డుతున్నారు. కానీ ఇక‌పై 18 శాతం మేర ట్యాక్స్‌ను చెల్లించాల్సిందే. ఈ క్ర‌మంలోనే చాలా వ‌ర‌కు క్రెడిట్ కార్డుల‌ను ఇచ్చే బ్యాంకులు ఇప్ప‌టికే త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు దీనిపై మెసేజ్‌లు పంపుతున్నాయి. మెయిల్స్ పెడుతున్నాయి. మ‌రి ఇది ఇంకా భ‌విష్య‌త్తులో ఏ మేర పెరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా క్రెడిట్ కార్డుల‌ను వాడుతున్న వారు.. బ‌హు ప‌రాక్‌. వెనుకా ముందు కొంచెం ఆలోచించి కార్డు వాడండి. లేదంటే స‌ర్వీస్ ట్యాక్స్ బాదుడుకు గురి కావ‌ల్సి వ‌స్తుంది.

Comments

comments

Share this post

scroll to top