గుండు కొట్టించుకున్న ప్రముఖ సింగర్ “సోను నిగమ్”..దీని వెనకున్న పెద్ద కథ ఏంటో తెలుసా..?

“సోను నిగమ్” ప్రముఖ బాలీవుడ్ సింగర్. తెలుగులో కూడా కొన్ని పాటలు పాడారు. ఇటీవల ఆయన రాత్రి బాగా అలిసిపోయి ఇంటికొచ్చి పడుకున్నారు. తెల్లారుజామున ఓ మస్జీద్ పెట్టిన స్పీకర్ శబ్దం వల్ల అతని నిద్ర మెలోకావల్సి వచ్చింది అంట. ఎదుటి వాళ్ళని ఆగ్రహం గురి చేసేది ఇదేమి మతం అని సంచలన వాక్యాలు చేసాడు ట్విట్టర్ లో…మతాన్ని గూండాగిరి అని కూడా అన్నాడు.

https://twitter.com/sonunigam/status/853758848133242880

https://twitter.com/sonunigam/status/853760205368078336

https://twitter.com/sonunigam/status/853761583666806784

https://twitter.com/sonunigam/status/853764889671720960

నిజానికి నేను మైనార్టీని అని సోను నిగ‌మ్ అన్నాడు. తాను చేసిన ట్వీట్లు ఓ సామాజిక స‌మ‌స్య‌కు సంబంధించిన‌వే కానీ.. మ‌తానికి సంబంధించిన‌వి కావ‌ని స్ప‌ష్టంచేశాడు. త‌న వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించ‌కూడ‌ద‌ని మీడియాను కోరాడు. త‌న గూండాగిరి వ్యాఖ్య‌ల‌ను కూడా అత‌ను స‌మ‌ర్థించుకున్నాడు. ఓ మ‌తానికి సంబంధించిన ఉత్స‌వాల‌ను రోడ్డుపై నిర్వ‌హిస్తూ.. వేరేవాళ్ల‌కు ఇబ్బంది క‌లిగించ‌డం గూండాగిరి కిందికే వ‌స్తుంద‌ని సోను అన్నాడు.

ఇస్లాంకు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నాడంటూ సోనుపై మూడు రోజులుగా ముస్లిం మ‌త‌పెద్ద‌లు గ‌రంగ‌రంగా ఉన్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే కోల్‌క‌తాలోని ఓ ముస్లిం మ‌త‌పెద్ద ఓ ఆఫ‌ర్ ప్ర‌క‌టించాడు. సోను నిగ‌మ్‌కు ఎవ‌రైతే గుండుకొట్టించి, అత‌ని మెడ‌లో పాత చెప్పుల దండ వేసి దేశ‌మంతా ఊరేగిస్తారో.. వారికి ప‌ది ల‌క్ష‌లు ఇస్తాన‌ని చెప్పాడు. దీనిపై సోను సీరియ‌స్ అయ్యాడు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు తానే గుండు కొట్టించుకుంటాన‌ని ప్ర‌క‌టించాడు. అన్నట్లుగానే మీడియా ముందు అతను గుండు కొట్టించుకున్నాడు.

 

 

Comments

comments

Share this post

scroll to top