సినిమాలో ఇంటర్ మిషన్ అని బోర్డ్ పడిందా…క్యాంటీన్ కు వెళ్లి ఓ చేతిలో పాప్ కార్న్ మరో చేతిలో కూల్ డ్రింక్ టిన్ ను తెచ్చుకోవాల్సిందే!. జర్నిలో ఉన్నామా ..అయితే ఓ లీటర్ థమ్సఫ్ బాటిల్ పక్కా గా ఉండాల్సిందే.! వొడ్కాలో స్పైటో, సెవెనప్పో తప్పక ఉండాల్సిందే. ఇంటికి అతిధులొచ్చారా..? ఫ్రిజ్ లోని కూల్ డ్రింక్ ను గాజు గ్లాసులలో అందించాల్సిందే…..ఇదంతా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్… నేను కూడా దీన్నే ఫాలో అయ్యేవాడిని. అయితే గతంలో కూల్ డ్రింక్ లో పురుగు మందుల అవశేషాలు అనే టాపిక్ రేజ్ అయినప్పుడు వీటి వినియోగం కాస్త తగ్గింది కానీ తర్వాత మళ్లీ మునపటి కంటే వేగంగా వ్యాపారం పుంజుకుంది.
అయితే నేను మాత్రం ఈ వీడియో చూశాక కూల్ డ్రింక్స్ తాగడమే మానేశాను. అంతెందుకు పాట విన్నాక కూల్ డ్రింక్ అంటేనే కడుపు తిప్పినట్టు అనిపిస్తుంది. అందుకే అంటారు కదా… తూటా కన్నా పాట పవర్ ఫుల్ అని బహుషా అదే కాబోలు….. పురుగుల మందు అవశేషాలు ఉన్నాయంటూ న్యూస్ పేపర్ల హెడ్ లైన్స్ లో వచ్చిన లైట్ తీసుకున్న నేను..ఈ పాట విన్నాక కూల్ డ్రింక్ జోలికే వెళ్లట్లేదు.
Watch Song On Cool Drinks:( Wait 3 Seconds For Video To Load)
ఇది చూశాకే నేను కూల్ డ్రింక్ లకు కటీఫ్ చెప్పాను!!!
Posted by Chantigadu on Sunday, January 3, 2016