శ్రీదేవి కూతురు జాహ్నవికి సారీ చెప్పిన సోనమ్ కపూర్…. పెళ్లి వేడుకలో ఏమైందో తెలుసా.?

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ , ఆనంద్ ఆహుజాల వివాహం అంగరంగవైభవంగా జరిగింది. సిక్కు సాంప్రదాయ ప్రకారం ఈ పెళ్లి వేడుకకి కపూర్ ఫ్యామిలి మొత్తం హాజరయింది..  కపూర్ ఫ్యామిలీకి చెందిన రాక్‌డేల్ బంగళాలో జరిగిన వీరి పెళ్లి వేడుకకు  బాలీవుడ్  ప్రముఖులు అమితాబ్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, కరణ్ జోహార్, స్వర భాస్కర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ,మరికొందరు నటులు హాజరయ్యారు.పెళ్లి వేడుకకు ముందు జరిగే మెహిందీ ఫంక్షన్లో ఫన్ని ఇన్సిడెంట్ చోటు చేసుకుంది..ఆ ఇన్సిడెంట్లో దివంగత నటి కూతురు జాన్వి కపూర్,సోనమ్ కి సారీ చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

బాలివుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ,తన స్నేహితుడు ఆనంద్ ఆహుజా ఇద్దరూ వివాహబందంతో ఒక్కటయ్యారు..సిక్కు సాంప్రదాయం ప్రకారం సోనమ్ కపూర్ పెళ్లి వేడుక జరుగింది. ఇందులో భాగంగా మెహందీ వేడుకలో పెళ్లి కూతురు ఛుదా (ఎర్రని గాజులు) ధరించి, గాజులతో పాటు కలేరి (సాంప్రదాయ వస్తువు)ని మరో అమ్మాయికి తాకించే ప్రయత్నం చేస్తారు. అలా ఎవరికైతే తాకిస్తారో త్వరలోనే వారి వివాహం జరుగుతుందని సిక్కుల నమ్మకం.నా తర్వాత పెళ్లి కూతురు కాబోయేది నువ్వే అంటూ తన సోదరి జాహ్నవి కపూర్‌కు కలేరీని తాకించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆటపట్టించింది సోనమ్ కపూర్. దీంతో జాహ్నవి కంగారు పడింది.. అయితే సోనమ్ అలాంటిదేమీ చేయక పోవడంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది. తర్వాత ఆ విధంగా ఇబ్బంది పడినందుకు సోనమ్ కి సారీ చెప్పింది జాన్వి..ఇప్పుడు ఇదే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Comments

comments

Share this post

scroll to top