సోష‌ల్ మీడియాలో రూ.2వేల నోటుతో ట్రెండ్ సృష్టిస్తున్న సోన‌మ్ గుప్తా బేవ‌ఫా హై..!

ఎవ‌రు సృష్టించినా… ఎప్పుడు సృష్టించినా క‌ల్పిత పాత్ర‌ల‌కు జ‌నాల్లో ఎంతటి క్రేజ్ ఏర్ప‌డుతుందో అంద‌రికీ తెలిసిందే. అవి కార్టూనే కావ‌చ్చు, లేదంటే యానిమేష‌న్‌, గ్రాఫిక్స్ కావ‌చ్చు. ఇంకోటి, మ‌రోటి కూడా కావ‌చ్చు. ఫిక్ష‌న‌ల్ క్యారెక్ట‌ర్స్ అంటే అవి ఎప్పుడూ జ‌నాల‌ను ఒక ఊపు ఊపేస్తాయి. అయితే ఇటీవ‌ల వ‌చ్చిన రూ.2వేల కొత్త నోటు పుణ్య‌మా అని అలాంటిదే ఓ క‌ల్పిత పాత్ర గురించి అంత‌టా ట్రెండ్ అవుతోంది. ఇంత‌కీ ఏంటా పాత్ర‌..? దాని గురించి తెలుసుకుందాం రండి..!

sonam-gupta-bewafa-hai

అప్ప‌ట్లో స‌న‌మ్ బేవ‌ఫా, బేవ‌ఫా స‌న‌మ్ అని రెండు సినిమాలు వ‌చ్చాయి గుర్తుందా..? స‌న‌మ్ బేవ‌ఫాలో స‌ల్మాన్‌ఖాన్ న‌టించ‌గా, బేవ‌ఫా స‌న‌మ్‌లో గుల్ష‌న్ కుమార్ సోద‌రుడు కృష్ణ‌న్ కుమార్ న‌టించాడు. అయితే ఈ రెండు సినిమాలను దృష్టిలో ఉంచుకుని రూ.10 నోటుపై ఎవ‌రో ఓ వ్య‌క్తి Sonam Gupta bewafa hai (సోన‌మ్ గుప్తా బేవ‌ఫా హై) అనే ఓ వాక్యాన్ని రాశాడు. అది కాస్తా జనాలంద‌రికీ చేరువైంది. అలా సోన‌మ్ గుప్తా అనే ఓ క‌ల్పిత పాత్ర సృష్టించ‌బ‌డింది. దీంతో అప్ప‌ట్లో ఇదొక ట్రెండ్ అయిపోయింది. ఎవర్ని చూసినా రూ.10 నోట్ల‌పై అదే వాక్యాన్ని రాయ‌డం మొద‌లు పెట్టారు.

కొంత మంది ఆ వాక్యాన్ని వేరే పేర్ల‌తో త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన ప‌దాల‌తో మార్చి రాస్తే, ఇంకొంద‌రు ఇంకా ముందుకు వెళ్లి వేరే దేశాల‌కు చెందిన క‌రెన్సీ నోట్ల‌పై, కాయిన్స్ పై కూడా ఆ వాక్యాన్ని రాయడం ప్రారంభించారు. దీంతో సోన‌మ్ గుప్తా అనే ఫిక్ష‌న‌ల్ క్యారెక్ట‌ర్ వైర‌ల్‌గా మారింది. కానీ కాల‌క్ర‌మంలో దీని గురించి అంద‌రూ మ‌రిచిపోయారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన రూ.2వేల కొత్త నోటుపై ఓ వ్య‌క్తి మ‌ళ్లీ అదే వాక్యాన్ని రాయ‌గా, ఇప్పుడీ క్యారెక్ట‌ర్ సోష‌ల్ మీడియాలో మ‌ళ్లీ ట్రెండ్ అవుతోంది. అలా ట్రెండింగ్‌గా మారిన ప‌లు ఫొటోల‌ను ఇప్పుడు చూద్దాం.

sonam-gupta-bewafa-hai-1

sonam-gupta-bewafa-hai-2

చూశారుగా… సోన‌మ్ గుప్తా అనే ఓ ఫిక్ష‌నల్ క్యారెక్ట‌ర్ ఎలా ఊపు ఊపుతుందో. మీకు అలాంటి నోటు దొరికితే గ‌న‌క దాన్ని ఫొటో తీసి మీరూ సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకోండి..!

Comments

comments

Share this post

scroll to top