నీచ‌మైన చ‌ర్య‌. ఆకలైంద‌ని త‌ల్లిని చంపి గుండె తిన్నాడు ఆ మృగాడు..!

రోజు రోజుకీ మ‌నుషులు ఎంత‌టి మృగాలుగా మారుతున్నారో ఇప్పుడు చెప్ప‌బోయే సంఘ‌ట‌న ఒక‌టి ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది. నిజంగా ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎక్క‌డో గానీ జ‌ర‌గ‌వు. పూర్వం ఒక‌ప్పుడు న‌ర‌మాంస భ‌క్ష‌కులు అని మ‌నం క‌థ‌ల్లో చ‌దివే వాళ్లం. సినిమాల్లో చూసే వాళ్లం. వాళ్లు ఇప్ప‌టికీ ఎక్క‌డో ఒక చోట ఉన్నారు లెండి, అది వేరే విష‌యం. అయితే అలాంటి వారు స‌హ‌జంగా అర‌ణ్యాల్లో మాత్రమే ఉంటారు. కానీ ఇప్పుడు చెప్ప‌బోయే ఘ‌ట‌న వింటే మ‌నం నివ‌సించే స‌మాజంలో ఇలాంటి వారు కూడా ఉంటారా..? అని వెన్నులో భ‌యం పుడుతుంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

అది మహారాష్ట్ర‌లోని కొల్హాపూర్ ప్రాంతం. అక్క‌డే ఎల‌వ అనే ఓ 65 ఏళ్ల వృద్ధురాలు నివాసం ఉంటోంది. అత‌ని కుమారుడు సునీల్ కుచ‌కుర్ణి. వ‌య‌స్సు 27 సంవత్స‌రాలు. అయితే సునీల్ ఏ ప‌నీ చేసే వాడు కాదు. పైగా విప‌రీతంగా మ‌ద్యం సేవించే వాడు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 4వ తేదీన య‌థావిధిగా పీక‌ల దాకా మ‌ద్యం సేవించి ఇంటికి చేరాడు. ఇంటికి రాగానే భోజ‌నం కావాల‌ని త‌ల్లి ఎల‌వ‌ను అడిగాడు. ఆమె లేద‌ని చెప్పింది.

ఆ త‌రువాత అత‌ను ఇరుగు పొరుగు ఇళ్ల‌కు వెళ్లి భోజ‌నం పెట్టాల‌ని అడ‌గ్గా వారు కూడా అందుకు నిరాక‌రించారు. దీంతో సునీల్ చేసేది లేక మ‌ళ్లీ ఇంటికి వ‌చ్చాడు. అయితే తిరిగి ఇంటికి వ‌చ్చిన అత‌ను చూస్తూ ఊరుకోలేదు. కోపం క‌ట్ట‌లు తెచ్చుకుంది. ఆ ఆవేశంతోనే త‌ల్లిని క‌త్తితో పొడిచి పొడిచి చంపాడు. అనంత‌రం ఆమె గుండెను బ‌య‌ట‌కు తీసి దానిపై ఉప్పు, మిరియాల పొడి చ‌ల్లుకుని చ‌ట్నీలో అద్దుకుని కొంత వ‌ర‌కు తిని బ‌య‌ట‌కు వ‌చ్చాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకుని సునీల్‌ను అరెస్టు చేశారు. అత‌ని ఇంటి నుంచి ఎల‌వ మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిజంగా… చాలా జుగుప్స‌ను క‌లిగించే విష‌యం ఇది. ఇలాంటి వారు మాత్రం మనకు తార‌స ప‌డ‌కూడ‌ద‌నే ఆశిద్దాం.

Comments

comments

Share this post

scroll to top