ఇతను అసలైన హీరో.! సెల్యూట్ భారతమాత ముద్దుబిడ్డ.

నిజమైన సైనికుడు గుండెల్లో తూటాలు దిగుతున్నా లెక్కచేయడు… సాహసం అతని ఊపిరి, వీరత్వం అతని చిరునామా. అలాంటి కోవలోకి చెందిన వీరుడే రాజేష్ నేగీ. పఠాన్ కోట్ ఘటన గుర్తుందిగా..?  అదిగో అక్కడ జరిగిన ఘటన చెబితే కానీ మన నేగీ వీరత్వం  అర్థం కాదు.  ఘజియాబాద్ కు చెందిన  రాజేష్ నేగి, ఎన్.ఎస్.జి. కమాండోగా విధులు నిర్వహిస్తున్నాడు. పఠాన్ కోట్ లో ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారన్న సమాచారం అందుకోగానే  ఆపరేషన్ పఠాన్ కోట్ లో సభ్యుడిగా ఆ ప్రదేశానికి వెళ్ళాడు నేగీ . ఉగ్రవాదుల దాడికి ప్రతిదాడీ చేస్తూ తనతో పాటు ఉన్న ఇతర కమాండోలలో స్పూర్తినింపుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఓ గ్రేనేడ్ అతనికి దగ్గర్లో పడింది. దీంతో రాజేష్ శరీరంలో 9 చోట్ల గాయాలయ్యాయి….ఓ దుర్వార్త ఏంటంటే ఆ గ్రెనేడ్ ఎఫెక్ట్ కి ఎడమకన్ను చూపును చాలా వరకు కోల్పోయాడు. దీంతో ఇప్పుడతను బెడ్ రెస్ట్ లో ఉన్నాడు.
Naik-Rajesh-Negi-750x500
ఘజియాబాద్ లోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు నేగిని ఆహ్వానించింది. తన గురించి తెలుసుకున్న నాయకులు, అధికారులు నేగిని కుటుంబానికి అండగా నిలబడేందుకు ముందుకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అతనికి ఆర్ధిక సహాయం చేయడానికి కృషి చేస్తోంది.
నేగీ కుటుంబమంతా సైన్యంలోనే:
నా కొడుకును చూసి నేనేంతో గర్వపడుతున్నాను. వాడు దేశసేవకే పుట్టాడు.. దేశ గౌరవాన్ని ఎప్పుడు తలదించుకునేలా చేయడు. అని నేగి తండ్రి ఎంతో గర్వంగా చెబుతున్నాడు. రాజేష్ తండ్రి ఒకప్పుడు ఆర్మీలో చేస్తూ రిటైర్ అయ్యారు, ఆయన సోదరుడు  ఉత్తమ్ 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు విడిచాడు.మరొక సోదరుడు ఆర్మీలోనే పనిచేస్తున్నాడు. తన కొడుకు ధైర్య సాహసాలు కలవాడని, ఈ గాయాల నుండి కోలుకొని త్వరలోనే విధుల్లో చేరతాడని మనో:ధైర్యాన్ని కోల్పోడని రాజేష్ తల్లిగారు తన కొడుకు గురించి చెప్పారు. మా కొడుకు మాతో ఉన్నందుకు మేం బాధపడటం లేదు, పటాన్ కోట్ లో చనిపోయిన సైనికుల కుటుంబాల గురించి బాధపడుతున్నాం. వారి కుటుంబాలు తొందరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను అని అతని తల్లి కోరుకుంది.
rajesh-negi-569e11da7215f_exlst
ఎటువంటి స్వార్థం లేకుండా దేశసేవకు, ప్రజల రక్షణకు అండగా నిలబడుతున్నారు మన సైనికులు. ఒంటిమీద గాయాలున్నా పోరాడటానికి సిధమైన ఇటువంటి సైనికులు మన దేశానికి ఎంతైనా అవసరం. తమ కొడుకు పడుతున్న కష్టాన్ని కళ్ళారా చూస్తూ. ….త్వరగా కోలుకొని ఆర్మీలోకి తిరిగి వస్తాడు అని  చెబుతున్న ఆ తల్లిదండ్రులకు హ్యాట్సాఫ్ .

Comments

comments

Share this post

scroll to top