ఆలోచన అంటే అది… కరెంట్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఏకంగా సోలార్ రోడ్డు వేసేశారు.!

ప్రపంచమంతా ఎదుర్కొంటున్న సమస్యలలో విద్యుచ్ఛక్తి ఒకటి.  విద్యుత్ (కరెంట్)ను  థర్మల్,వాటర్, విండ్ మిల్స్, సోలార్ ఇలా వివిధ పద్ధతులలో ఉత్పత్తి చేసుకుంటూ ఉపయోగించుకుంటున్నాం.మనమైతే ఎక్కువగా బొగ్గు నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ మీదే  ఆధారపడ్డాం..బొగ్గు నిల్వలు అయిపోతే మన జీవితాలు అంధ:కారంలో మగ్గాల్సిందే… తరగని శక్తి వనరైన సూర్య శక్తిని మనం అంతగా వినియోగించుకోలేకపోతున్నాం..  సోలార్ నుండి కరెంట్ ప్రొడ్యూస్ చేయడంలో మనమింకా శైశవ దశలోనే ఉన్నాం.

కానీ  నెదర్లాండ్ దేశస్థులు మాత్రం ఒకడుగు ముందుకేసి, ఏకంగా సోలార్ రోడ్లను వేసి దాని ద్వారా  విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఔరా అనిపించారు. సోలార్ రోడ్స్. వినడానికి కొత్తగా ఉన్నా… వీటి వల్ల ప్రొడ్యూ స్ అయ్యే కరెంట్ ద్వారా ఒక కుటుంబానికి సంవత్సరం వరకు కరెంట్ ను ఉపయోగించుకోవచ్చు.సోలార్ ప్యానెల్స్ ను నాన్ బ్రేకబుల్ గ్లాస్ తో తయారు చేసి వాటిని రోడ్లపై ప్లేస్ చేస్తారు.ఈ సోలార్ ప్యానెల్స్ ఎల్ఈడీ లైట్స్ తో తయారుచేయబడి ఉంటాయి. సూర్య శక్తిని ఆ LED  లు  గ్రహించి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

qili7sbllysmm3dzjm8yu3ffgjwqrge7uk7ctnlrgaq5zx0n4qpnxih3dmhtsjd8-750x500

డచ్ కి దగ్గరలోని ఆమ్ స్టర్ డ్యాం తీరప్రాంతంలో గల క్రోమినిలో 2014లో 70మీటర్ల సోలార్ పానెల్స్ ను బైక్, సైకిల్ వాహనదారులు వెళ్ళే ప్రాంతంలో అమర్చారు. కేవలం ఆరు నెలలో 3000 కిలో వాట్ హవర్ ల కరెంట్ సోలార్ రోడ్ ప్యానెల్స్ ద్వారా జెనరేట్ కావడం వారిని ఆశ్చర్యపరిచింది. ఈ కరెంట్ ఒక కుటుంబం ఏడాదిపాటు వినియోగించుకోవని ఆ అధికారులు తెలిపారు.సోలార్ రోడ్స్ వల్ల అధిక విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసి చూసిన అధికారులు, ఆ ప్లేస్ లో మరిన్ని సోలార్ ప్యానెల్స్ ను ఫిక్స్ చేశారు. ఒక్కో సోలార్ ప్యానెల్ నుండి స్క్వైర్ సెంటీ మీటర్ కు 70 కిలో వాట్ విద్యుత్ ఒక సంవత్సారానికి ఉత్పత్తి అవుతుంది.

solar-road-design

ఈ రోడ్ పై 1,50,000 మంది సైకిల్ ప్రయాణికులు ప్రయానించవచ్చు. గత ఐదేళ్లుగా ఇలా రీసెర్చ్ చేసి విజయవంతమైన ఆ అధికారులు, సోలార్ రోడ్స్ ను దేశమంతా విస్తీర్ణం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నిన్నటివరకు వ్యర్థ్య పదార్థాలు, శిలాజాల ద్వారా విద్యుత్ ను ఉత్పత్తిచేసి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం. కాగా సోలార్ రోడ్స్ ద్వారా సులభతరంగా విద్యుత్ ను ఉత్పత్తి చేయడం అభినందించదగ్గ విషయమే కదా. ఇలాంటివి మనవాళ్ళు తయారుచేస్తే  మనకు కరెంట్ కోతలు ఉండకుండా బాగుంటుంది కదా.

Comments

comments

Share this post

scroll to top