సాఫ్ట్ వేర్ జంటల్లో పెరిగిపోతున్న విడాకుల కేసులు, కోడింగ్ కి కాపురం కి సింక్ అవ్వట్లేదా.?

మనదేశంలో విడాకుల సంఖ్య ఇటీవల కాలం లో ఎక్కువైంది, హైదరాబాద్ లో కూడా విడాకులు తీసుకొనే జంటల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి కోర్టుల్లో గతేడాది సుమారు 8 వేల విడాకుల కేసులు నమోదయ్యాయి. ప్రతీ ఏడాది 5 వందల చొప్పున పెరుగుతూ పోతున్నాయి. హైదరాబాద్‌లోని ఫ్యామిలీ కోర్టుల్లో రోజుకు ఐదు కేసుల చొప్పున నమోదవుతున్నాయి. వీటిలో ఎక్కువగా సాఫ్ట్‌‌వేర్‌‌కు చెందిన జంటల కేసులే కన్పిస్తున్నాయి. వంద కేసుల్లో 60 నుంచి 80 దాకా వారివే ఉంటున్నాయి. మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్‌‌పల్లి లాంటి ఏరియాల్లోని పోలీస్ స్టేషన్‌‌లలో కూడా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కోర్టుల వరకు వెళ్లాక డ్రాప్ అవుతున్న కేసులు 10 శాతం లోపు ఉంటున్నాయి. డైవర్స్‌‌ కోసం ముందుకొస్తున్న జంటల్లో 30 నుంచి 40 శాతం వరకూ విడాకులు తీసుకుంటున్నారు. విడాకులకు వెళ్తున్న సగం కేసులు కౌన్సిలింగ్ సెంటర్స్ దగ్గర ఆగిపోతున్నాయి.

 

సెంటర్స్ దెగ్గర ఆగని వారు.. :

కౌన్సిలింగ్ సెంటర్స్ లో కూడా పని కాకుంటే ఇంక తరువాయి డివోర్స్ కె వెళ్తున్నారు జంటలు, ఒకరు కాకుంటే ఒకరు కూడా వెనక్కి తగ్గట్లేదు, సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులు చాలా మంది ఉండటం తో, టేక్ ఏ బ్రేక్ అని అంటున్నారు, విడాకులు కాకుండా ‘జ్యుడిషియల్ సెపరేషన్’ ఆప్షన్ ఎంచుకుంటున్నారు. అంటే వారు భార్యభర్తలుగానే ఉంటూనే రెండు నుంచి ఐదేళ్ల వరకు విడివిడిగా ఉంటారు. ఈ ఆప్షన్ ‌ను ఎక్కువగా మగవాళ్లే అడుగుతున్నారు. తర్వాత నచ్చితే కలిసి ఉంటారు లేదంటే విడాకులు తీసుకుంటున్నారు. ఈ దూరంగా ఉన్న కాలం లో ఎవరు ఏం చేసిన ఎవరు పట్టించుకోరు, నిర్ణిత సమయం తరువాత కలిసుండాలా విడిపోవాలి అని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు డిసైడ్ అవుతారు, అలంటి సిట్యుయేషన్స్ లో కూడా సాఫ్ట్ వేర్ వాళ్ళు విడాకులు తీసుకోడానికే ఇష్టపడుతున్నారని సమాచారం, పెళ్లి అని ఒక పేరు పెట్టుకొని కార్యాలు పూర్తయ్యాక విడాకులు అని పేరు పెడుతున్నారు అని కొందరు పెద్దలు మండిపడుతున్నారు, ఒకసారి పెళ్లి అయితే కష్ట సుఖాల్లో కడదాకా తోడుగా నిలవాలి, అంతే కానీ వివాహేతర సంబంధాల పెట్టుకోడమో, వెనక్కి తగ్గలేక విడాకులు తీసుకోడం లాంటివి సమంజసం కాదని కూడా పెద్దలు చెబుతున్నారు.

 

Comments

comments

Share this post

scroll to top