సాఫ్ట్‌వేర్ జాబ్ మానేసి వ్యవసాయం చేస్తూ.. కేవలం 4 నెలల్లోనే కోటి రూపాయలు సంపాదించాడు.!

కష్టపడే తత్వం, పట్టుదల ఉండాలే గానీ ఎంతటి పనిలోనైనా విజయాన్ని సాధించవచ్చని నిరూపించాడు ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తన గ్రామంలో రైతులు పడుతున్న అవస్థలను, దీన స్థితిలో ఉన్న వ్యవసాయాన్ని చూసి మనసు చలించగా, చేస్తున్న జాబ్‌ను మానేసి రైతులను ఆర్థికంగా ప్రగతి బాటలో నడిపించాలని కంకణం కట్టుకున్నాడు. ఒక కట్టుదిట్టమైన ప్రణాళికతో, నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తూ రైతుల జీవితాలు బాగుపడేలా చేశాడు. అతనే మధుచందన్.ఐటీకి మారుపేరుగా ఉన్న బెంగుళూరు నగరానికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో బెంగుళూరు-మైసూర్ హైవే మధ్యలో ఉన్న ఓ మారుమూల గ్రామం మండ్య. ఈ గ్రామానికి చెందిన మధుచందన్ చిక్కదేవయ్య యూఎస్‌ఏలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా  పనిచేస్తున్నాడు. కాగా తన చిన్నతనం నుంచే తన గ్రామంలోని రైతుల బాధలను చూస్తూ వస్తున్న మధుచందన్‌ను 2014-15 సంవత్సరాల్లో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆత్మహత్య చేసుకునన్న రైతుల కుటుంబాలు మరింతగా కలచివేశాయి.
దీంతో మధుచందన్ తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని మానేసి సొంత గ్రామానికి వచ్చాడు. వచ్చీ రాగానే రైతుల బాధలను మరింత కూలంకషంగా తెలుసుకున్నాడు. అప్పుల బాధలు, పంటలు సరిగ్గా పండకపోవడం, పండినా గిట్టుబాటు ధర లేకపోవడం, వర్షపాతం తగ్గడం తదితర కారణాలతో దీనావస్థకు చేరుకున్న రైతు కుటుంబాలను గమనించాడు. దీంతో వారిని సంక్షేమం దిశగా నడిపించడం కోసం, ఆర్థికంగా ఎదిగేలా చేసేందుకు పూనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రసాయన ఎరువులను తక్కువగా, సహజ సిద్ధమైన ఎరువులను ఎక్కువగా వాడి పంటలను పండించే చక్కని ఫలితాలను అందించే ఆర్గానిక్ వ్యవసాయం పట్ల ఆ రైతులను కార్యోన్ముఖులను చేయాలని నిశ్చయించాడు.
engineer-750x500
దీంతో అనుకున్నదే తడవుగా మధుచందన్ తన తోటి స్నేహితులతో కలిసి దాదాపు రూ.1కోటి నిధులను సేకరించాడు. వాటితో మండ్య ఆర్గానిక్ ఫార్మర్స్ కో ఆపరేటివ్ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. దీనికి తోడు ఆర్గానిక్ మండ్య అనే బ్రాండ్‌ను కూడా రిజిస్టర్ చేశాడు. ఈ సొసైటీ ఆధ్వర్యంలో మండ్య గ్రామంలో నివసించే 240 మంది రైతులకు ఆర్గానిక్ వ్యవసాయం పట్ల మెళకులను, సూచనలపై అవగాహనను మధుచందన్ కల్పించేవాడు. దీని వల్ల బియ్యం, ధాన్యాలు, మసాలా దినుసుల వంటి పంటలను ఆ రైతులు పండించేవారు. ఇలా పండిన పంటలను స్వయంగా అమ్ముకునేందుకు ఆర్గానిక్ మండ్య అనే షాప్‌ను అత్యంత రద్దీగా ఉండే బెంగుళూరు-మైసూర్ హైవే పక్కన మధుచందన్ ఏర్పాటు చేశాడు. వినియోగదారులకు మండ్య షాప్ ద్వారా రూ.999, రూ.1499, రూ.1999 చొప్పున గ్రాసరీ బాస్కెట్‌లను విక్రయించే వారు. వీటిలో వారికి అవసరమైన బియ్యం, పప్పు, నూనెలు, హెల్త్‌కేర్ ఉత్పత్తులు, మసాలా దినుసులు, శీతల పానీయాలు వివిధ రకాల పరిమాణాల్లో ఉంటాయి. కాగా ఈ షాప్‌కు పక్కనే మధుచందన్ స్వయంగా ఓ ఆర్గానిక్ రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించాడు.
12778672_756344894467199_7612014156209667987_o-1024x760
అయితే మధుచందన్ ఇంకా అంతటితో ఆగలేదు. నగరవాసులకు, రైతులకు మధ్య అనుసంధానం పెంచడం కోసం ఆర్గానిక్ టూరిజం అనే కొత్త కార్యక్రమానికి మధు శ్రీకారం చుట్టాడు. దీని ద్వారా నగరవాసులు ఆర్గానిక్ వ్యవసాయం గురించిన విషయాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. దీంతో పాటు నగరవాసులు వాలంటీర్లుగా మారి రైతుల పొలాల్లో పనిచేసేందుకు వీలు కలగుతుంది. ఇది రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఇదే కాక స్వెట్ డొనేషన్ క్యాంపెయిన్ అనే మరో కార్యక్రమాన్ని కూడా బెంగుళూరు నగరంలో మధు ప్రారంభించాడు. ఇది వేయి మంది వాలంటీర్లను ఆకర్షించేందుకు ఉపయోగపడింది. ఫామ్ షేర్ అనే మరో వినూత్న ప్రయోగంతో నగరవాసులను ఆర్గానిక్ వ్యవసాయంలో భాగస్వాములను చేసేవాడు. దీని వల్ల నగరవాసులు మండ్య గ్రామంలో అర ఎకరం నుంచి 2 ఎకరాల వరకు భూమిని రూ.35వేలకు అద్దెగా తీసుకుని దాంట్లో తమ సొంత ఆహారాన్ని పండించేందుకు వీలు కలుగుతుంది. ఇలా వారు ఇచ్చే అద్దె మొత్తంలో కొంత భాగం వారికి సహాయం అందించే రైతుకు వెళ్లేది. అయితే  నగరవాసులు అలా పండించిన పంటలను మండ్య షాప్‌కు విక్రయించేలా వీలు కల్పించారు. లేదంటే తమతోపాటు తీసుకెళ్లవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ తరహా కార్యక్రమాలు నగర వాసుల్లో వ్యవసాయం పట్ల ఆసక్తిని కలిగించేవి. దీనికి తోడు రైతులకు ఎంతో కొంత ఆదాయం కూడా వచ్చేది.
12718067_758321560936199_3874792793529149490_n (1)
కాగా ప్రారంభమైన నాటి నుంచి కేవలం 6 నెలల కాలంలోనే ఆర్గానిక్ మండ్య గణనీయమైన వృద్ధిని సాధించింది. ఇప్పుడు ఆ షాప్ కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. మొదటి 4 నెలల్లో షాప్ ద్వారా దాదాపు రూ.1 కోటి వరకు సంపాదించారు. కాగా ఇప్పుడు ఆ కో ఆపరేటివ్ సొసైటీలో 500 మంది రైతులు సభ్యులుగా ఉండి లబ్ది పొందుతున్నారు. వీరంతా దాదాపు 200 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. ఇలా మధు దాదాపు 10వేల కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పించాడు. ఈ నేపథ్యంలోనే ఆ రైతులంతా దాదాపు రూ.30 కోట్ల ఆదాయాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార దక్షత, కష్టించే తత్వం ఉన్న రైతులు ఉంటే ఆర్గానిక్ మండ్య లాంటి గ్రామాలను ఎన్నింటినో తీర్చిదిద్దవచ్చని నిరూపించాడు మధుచందన్. మీరు కూడా ఎప్పుడైనా ఆ హైవేకు వెళ్తే ఒక్కసారి ఆర్గానిక్ మండ్య షాపును సందర్శించండి. వీలైతే ఆ గ్రామంలో అవలంబిస్తున్న ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులను పరిశీలించండి.

Comments

comments

Share this post

scroll to top