సోఫియా హ‌య‌త్ ఇప్పుడు హాట్ మోడ‌ల్ కాదు… ఆమె ఓ కొత్త అవ‌తారంలోకి పూర్తిగా మారిపోయింది..!

మొన్నా న‌డుమ ఓ వార్త చ‌దివాం క‌దా! అదేనండీ ఇంట‌ర్నెట్‌లో నీలి చిత్రాలు ఎక్కువగా చూసే వారు చివ‌రికి ఆధ్యాత్మిక‌త వైపు మ‌ళ్లుతార‌ని. ఆ… అదే వార్త గుర్తుంది క‌దా! స‌రిగ్గా అదే విష‌యాన్ని గుర్తు చేస్తూ తాజాగా ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అంటే విష‌యం అలాంటిది కాక‌పోయినా, దాదాపు ఆ వార్త‌కు, ఇప్పుడు చెప్ప‌బోయే దానికి కొంత పోలిక ఉంటుంది. అదేమిటంటే…

సోఫియా హ‌య‌త్ తెలుసుగా! త‌న అంద‌చందాలు, గ్లామ‌ర్‌తో మొన్న‌టి దాకా యూత్‌కు నిద్ర లేకుండా చేసింది. మోడ‌ల్‌గా, న‌టిగా ఈవిడ త‌న‌కు త‌గ్గ పేరునే సంపాదించుకుంది. అదేదో టీవీ చాన‌ల్‌లో ప్ర‌సార‌మ‌య్యే బిగ్‌బాస్ అనే రియాలిటీ షోలోనూ పాల్గొని ఈమె అంద‌రి దృష్టినీ త‌న‌వైపు తిప్పుకుంది. ఆ… ఆవిడే… అయితే ఏంటి అంటారా..? అక్క‌డికే వ‌స్తున్నాం. కాక‌పోతే ఆమె గురించిన ఓ విషయం ఇప్పుడు చెప్ప‌బోతున్నాం కాబ‌ట్టి, దాన్ని విని ఆశ్చ‌ర్యపోకండేం!

sofia-hayat

న‌టి, మోడ‌ల్ సోఫియా హ‌య‌త్ త‌న కెరీర్‌కు గుడ్‌బై చెప్పి క్రిస్టియ‌న్ న‌న్ (స‌న్యాసిని)గా మారింది. అవును. మీరు విన్న‌ది నిజ‌మే. ఈమె ఒక‌ప్ప‌టి హాట్ భామ కాదు. ఇప్పుడు దైవం ద‌గ్గ‌ర గ‌డిపే స‌న్యాసినిగా కొత్త అవ‌తార‌మెత్తింది. గ‌త 3 రోజుల క్రితం ముంబైలో జ‌రిగిన ఓ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో సోఫియా త‌న నూత‌న అవ‌తారం గురించిన విశేషాలను తెలియ‌జేసింది. ఇక‌పై తాను స‌న్యాసినిగా జీవించ‌నున్నాన‌ని, దేవుడి ద‌గ్గ‌రే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతాన‌ని, స‌మాజ సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటాన‌ని తెలియ‌జేసింది. త‌న‌నంతా ‘గ‌యా మ‌ద‌ర్ సోఫియా (Gaia Mother Sofia)’గా పిల‌వాల‌ని చెప్పింది. ర‌తిలో పాల్గొన‌డ‌మ‌నేది ఓ ప‌విత్ర‌మైన కార్య‌మ‌ని, దాన్ని ఇంకో దృష్టితో చూడ‌వ‌ద్ద‌ని చెప్పింది. ‘అంతేలే మ‌రి! జీవితంలో చూడాల్సిందంతా చూసి, అనుభ‌వించాల్సిందంతా అనుభ‌వించేస్తే చివ‌ర‌కు మిగిలేది అదే అవతారం క‌దా!’ అని ఈ విషయం తెలిసిన జ‌నాలు గుస గుస‌లాడుతున్నారు. చివ‌రిగా అంద‌రినీ షాకింగ్‌కి గురి చేసే మ‌రో విష‌యం కూడా సోఫియా చెప్పేసింది. అదేంటంటే వ‌క్షోజాలు అందంగా క‌న‌ప‌డ‌డం కోసం తాను గ‌తంలో సిలికాన్ ఇంప్లాంట్స్ పెట్టుకున్నాన‌ని, ప్ర‌స్తుతం స‌న్యాసినిగా మార‌డంతో వాటిని తీసేశాన‌ని ఏకంగా మీడియా ముందే ఆ సిలికాన్ ఇంప్లాంట్స్‌ను చూపిస్తూ అంద‌రినీ మ‌రింత విస్మ‌యానికి గురి చేసింది. ఇప్పుడు మీరే చెప్పండి, పైన మేం చెప్పిన ఓ వార్త‌కు ఈ తాజా వార్త ఎంత ద‌గ్గ‌రి పోలిక‌తో ఉందో! మీకు అర్థం అయి ఉంటుంది లెండి!

సోఫియా హ‌య‌త్ ఒక‌ప్ప‌టి, ఇప్ప‌టి వీడియోను కింద చూడ‌వ‌చ్చు…

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top