“తన సోదరుడితో శృంగారం చేయమనేవాడు నా భర్త”.! షమీ రాసలీలల కేసులో మరో ట్విస్ట్ ఇచ్చిన అతని భార్య.!

క్రికెట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ త‌న భార్య హ‌సిన్ జ‌హాన్‌ను చిత్ర‌హింస‌ల‌కు గురిచేస్తూ వేధించినందుకు గాను ప్ర‌స్తుతం అత‌ను చ‌ట్ట‌ప‌రంగా అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. వీరి వ్య‌వ‌హారంలో మ‌న‌కు రోజుకో కొత్త విష‌యం తెలుస్తోంది. ష‌మీకి అనేక మంది మ‌హిళ‌ల‌తో అక్ర‌మ సంబంధాలు ఉన్నాయ‌ని అత‌ని భార్య హ‌సిన్ ఇటీవ‌లే చెప్ప‌గా, అందుకు సంబంధించిన సాక్ష్యాలంటూ ప‌లు స్క్రీన్ షాట్ల‌ను కూడా త‌న ఫేస్‌బుక్ ఖాతాలో అప్‌లోడ్ చేసింది. అయితే ప్ర‌స్తుతం హ‌సిన్ మ‌రో కొత్త విష‌యాన్ని చెప్పింది.

క్రికెట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ అతని సోద‌రున్ని, త‌న‌ను ఒక గధిలో బంధించాడ‌ని, అత‌ని సోద‌రునితో శృంగారంలో పాల్గొనాల‌ని ష‌మీ బ‌ల‌వంతం చేసేవాడ‌ని హ‌సిన్ చెప్పింది. అంతేకాకుండా ఒకానొక సంద‌ర్భంలో ష‌మీ త‌న‌కున్న అఫెయిర్ల గురించి ఒప్పుకున్నాడ‌ని కూడా ఆమె తెలిపింది. ష‌మీ, అత‌ని కుటుంబ స‌భ్యులు త‌న‌ను ఎన్ని చిత్ర హింస‌ల‌కు గురి చేసినా భ‌రించాన‌ని, అత‌నికి న‌చ్చ జెప్పే య‌త్నం చేశాన‌ని అయినా అత‌ను మాట విన‌లేద‌ని త‌న‌ను చిత్ర హింస‌ల‌కు గురి చేస్తూనే వ‌చ్చాడ‌ని హ‌సిన్ మీడియా ఎదుట వాపోయింది.

ష‌మీకి ఉన్న ద‌గ్గ‌రి బంధువుల‌కు కూడా ఈ విష‌యాన్ని చెప్పాన‌ని, అయితే వారు అంత సీరియ‌స్‌గా ఆ విష‌యాన్ని తీసుకోలేద‌ని, ష‌మీ స్టార్ క్రికెట‌ర్ అయినందున త‌న‌నే స‌ర్దుకుపొమ్మ‌ని చెప్పార‌ని హ‌సిన్ తెలియ‌జేసింది. ష‌మీ, అత‌ని కుటుంబ స‌భ్యులు త‌న‌ను ఒకానొక ద‌శ‌లో చంపాల‌ని చూశారని కూడా హ‌సిన్ తెలిపింది. అయితే ప్ర‌స్తుతానికి ష‌మీతోపాటు అత‌ని కుటుంబంలోని మ‌రో న‌లుగురిపై కేసు న‌మోదు కాగా పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. ఇక ఈ విష‌యంలో ముందు ముందు ఏమ‌వుతుందో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top