కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఫోటో సోషల్ మీడియాలో వైరల్..! ఎందుకో తెలుసా.?

మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అన్నారు పెద్ద‌లు. అంటే.. పెళ్లిళ్లు స్వ‌ర్గంలో నిర్ణ‌యించ‌బ‌డ‌తాయి అన్న‌మాట‌. వాటిని దేవుడే నిర్ణ‌యిస్తాడు, దేవుని ఆదేశం ప్ర‌కారమే పెళ్లిళ్లు ఫిక్స్ అవుతాయి, మ‌ధ్య‌లో మ‌నం నిమిత్త మాత్రులం.. అని చెప్పేందుకు ఆ ప‌దం వాడ‌తారు. అయితే నిజంగా కొన్ని పెళ్లిళ్ల‌ను చూస్తే ముందు చెప్పిన మాట అబ‌ద్ధ‌మేమో అనిపిస్తుంది. అవును, ఎందుకంటే జంట ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు పుట్టిన‌ట్టుగా మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అన్న‌ట్టుగా ఉంటేనే ముందు చెప్పిన మాట స‌త్య‌మ‌వుతుంది. లేక‌పోతే కాదు క‌దా. ఈ క్ర‌మంలో కొన్ని జంట‌ల‌ను చూస్తే మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అని అస్స‌లు అన‌లేరేమో..! కింద ఇచ్చిన ఫొటోలు చూస్తే మీకు తెలుస్తుంది.

చూశారు క‌దా. జంట ఎలా ఉందో. భ‌ర్త మ‌రుగుజ్జు. భార్య అంద‌గత్తె. అయితే ఈ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఇది ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌దు కానీ, ఈ జంటను ప్రస్తుతం చాలా మంది విమ‌ర్శిస్తున్నారు. ఆమె అతన్ని డ‌బ్బు కోస‌మే పెళ్లి చేసుకుని ఉంటుంది అని కొంద‌రు కామెంట్లు పెడుతుంగా, మ‌రికొంద‌రు మాత్రం ప్రేమ గుడ్డిది అని అంటున్నారు. అయితే అస‌లు ఇది నిజ‌మైన పెళ్లేనా లేదంటే ఏదైనా టీవీ సీరియ‌ల్‌, సినిమా షూటింగా అని కూడా కొంద‌రు సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు.

గ‌తంలోనూ కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ కృష్ణ ప్రియ‌ను వివాహం చేసుకోగా ఆ జంట‌కు ఇలాగే కామెంట్లు వ‌చ్చాయి. ఇక గతంలో బంగ్లాదేశ్ యాక్ట‌ర్ అలోమ్ కూడా స‌రిగ్గా ఇలాగే ఓ అంద‌మైన యువ‌తిని పెళ్లి చేసుకోగా అత‌న్ని కూడా సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ జంట‌ల‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. ప్ర‌స్తుతం ఇదే కోవ‌లో పైన చెప్పిన జంట‌కు కూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీంతో ఈ జంట పెళ్లి ఫొటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి ఇది నిజంగా పెళ్లో, కాదో మాత్రం తెలియ‌దు. కానీ ఒక వేళ నిజం పెళ్లి అయితే..? అది మ‌న‌కు ఎలాగూ తెలుస్తుంది క‌దా. ఎవ‌రో ఒకరు ఈ జంట‌ను ట్రేస్ చేస్తారు లెండి..!

Comments

comments

Share this post

scroll to top