ఆమె స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మంలో అలా పాల్గొంది. అందుకు నెటిజన్లు ఆమెను ఏమంటున్నారంటే..?

దేశ ప్ర‌ధాని మోడీ తీసుకువ‌చ్చిన స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మం నిజంగా చాలా మంచిదే. దాంతో మన చుట్టూ ఉన్న ప‌రిస‌రాలు చాలా శుభ్రంగా ఉంటాయి. ఎలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త ప‌డ‌వ‌చ్చు. కానీ అలాంటి కార్య‌క్ర‌మంలో ఓ మ‌హిళ అలా పాల్గొంది. అందుకు కేంద్ర మంత్రి ప్ర‌శంసించారు కూడా. కానీ నెటిజన్లు మాత్రం ఆ మ‌హిళ‌కు క్లాస్ పీకుతున్నారు. ఇంత‌కీ అస‌లు ఆమె ఎవ‌రు, స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మంలో ఆమె ఎలా పాల్గొంది, ఎందుకు ఆమెను జ‌నాలు విమ‌ర్శిస్తున్నారో తెలుసా..?

కర్ణాటకలోని మంగళూరులో రామకృష్ణా మిషన్ తాజాగా స్వచ్ఛ మంగళూరు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి సదానందగౌడ ఒక మహిళ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆమె పేరు సుదీక్షా కిరణ్ సువర్ణ అని, ఏడాది కొడుకును చంకన వేసుకుని మరీ స్వచ్ఛ మంగళూరు కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని ట్వీట్ చేశారు. ఆమె మిస్ ఇండియాకన్నా ఎక్కువేనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కాగా సదానందగౌడ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు విరుచుకుప‌డుతున్నారు. ఇటువంటి పని.. బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదని, దీనిని తల్లి గుర్తించలేదని ఒకరు కామెంట్ చేయగా, ఆ తల్లికి పిల్లల సంరక్షణ తెలియదని మరొకరు పోస్టు పెట్టారు. ఆ తల్లి తాను మాస్క్ ధరించి, పిల్లవాడికి కూడా మాస్క్ వేసి ఈ పని చేస్తే బాగుండేదని మరొకరు సూచించారు. దేశంలో మంత్రుల దర్శనం తగ్గిపోయి ప్ర- దర్శనం ఎక్కువైపోయిందని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇలా ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌లలో స‌ద‌రు మ‌హిళ చేసిన ప‌నికి అంద‌రి నుంచి విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. మ‌రి ఈ విష‌యంలో మీరేమంటారు..!

Comments

comments

Share this post

scroll to top