“శివబాలాజీ, రాజీవ్ కనకాల” నటించిన “స్నేహమేరా జీవితం” హిట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్(తెలుగులో)

Movie Title (చిత్రం): స్నేహమేరా జీవితం (Snehamera Jeevitam)

Cast & Crew:

  • నటీనటులు: శివబాలాజీ, రాజీవ్ కనకాల, సుష్మ యార్లగడ్డ, సత్య తదితరులు
  • సంగీతం: సునీల్ కశ్యప్
  • నిర్మాత: శివబాలాజీ
  • దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి

Story:

అనాధ అయిన మోహన్ (శివ బాలాజీ)ని చిన్నపట్టినుండి చేరదీసి తన సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకుంటాడు చలపతి (రాజీవ్ కనకాల). తాను ఉంటున్న ఊరికి ఎలాగైనా సరే MLA అవ్వాలి అన్నది చలపతి బలమైన కోరిక. ఇక అదే సమయంలో ఇందిర (సుష్మా)ని మోహన్ ఇష్టపడతాడు, కాని దైర్యంగా ఆ మాట తనకి చెప్పలేడు. ఇక ఇది తెలుసుకున్న చలపతి తన స్నేహితుడైన మోహన్ కి ఈ విషయంలో సహాయం చేస్తాను అని మాట ఇస్తాడు. అయితే కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకోవడంతో చలపతిపైన మోహన్ ద్వేషం పెంచుకుంటాడు. అతని రాజకీయ భవిష్యత్తు నాశనం చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. ప్రాణ స్నేహితుడిని దెబ్బతీయాలని మోహన్ ఎందుకు అనుకుంటాడు? అసలు వీరి మధ్య ఏం జరిగింది? మోహన్ తన పంథాన్ని నిలబెట్టుకుంటాడా లేదా అనేది తెరపైన చూడాలి.

Review:

1982 నేపథ్యంలో సాగే కథ ఇది. దర్శకుడు ఆ నేపథ్యాన్నే ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కాదు. అదే కథను ఈ జనరేషన్‌కు తగ్గట్టు కూడా తీయొచ్చు. స్నేహానికి సంబంధించిన కథలు ఎప్పుడూ బలమైన ఎమోషన్‌పై ఆధారపడి ఉంటాయి. దానిని ఎంత బలంగా చూపిస్తే చిత్రం అంత ఆకట్టుకుంటుంది. కానీ, ఈ చిత్రంలో మోహన్‌-చలపతి మధ్య బంధాన్ని అనుకున్నంత స్థాయిలో ఎలివేట్‌ చేయడంలో దర్శకుడు తడబడ్డాడు. మోహన్‌ వూరి నుంచి వెళ్లిపోయిన తర్వాత కథంతా అతని చుట్టూనే తిరుగుతుంది. ఆ సమయంలో చలపతి పాత్ర కనపడదు. దీంతో ఫ్రెండ్‌షిప్‌ ఎలిమెంట్‌ కట్‌ అయిపోయినట్లు అనిపిస్తుంది. స్నేహితులు మళ్లీ ఎప్పుడు కలుసుకుంటారు? అనే ఆత్రుతను ప్రేక్షకుడిగా కలిగిస్తే బాగుండేది. తెరపై సన్నివేశాలు నడుస్తున్నా, అవి ప్రేక్షకుడి హృదయాన్ని తాకలేకపోయాయి. స్నేహితులు ఇద్దరూ మళ్లీ కలిసిపోయే సన్నివేశాలను హృదయానికి హత్తుకునేలా తీర్చిదిద్దాల్సింది. తుపాకీ కోసం పోలీసుల వెతుకులాట.. చలపతిపై పగను పెంచుకున్న ప్రత్యర్థులు.. ఇవన్నీ అసలు కథకు అంతగా అతకలేదు. చివర్లో టైమ్‌ బాంబు నేపథ్యంలో నడిచిన సన్నివేశాలనైనా రక్తికట్టించాల్సింది.

వబాలాజీది ప్రాధాన్యం ఉన్న పాత్ర. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. గుబురు గడ్డంతో ఓ కొత్త లుక్‌లో కనిపించాడు. పూల రంగడు తరహా పాత్రలో రాజీవ్‌ కనకాల దర్శనమిస్తాడు. ఆయన పాత్రే కాస్త హాస్యాన్ని పండిస్తుంది. కథానాయిక పాత్రకు ప్రాధాన్యం లేదు. ఆమె ఉన్న సన్నివేశాలు కూడా తక్కువే. సత్య కాస్త రిలీఫ్‌ను ఇస్తాడు. చలపతిరావు, షఫీవి చిన్న చిన్న పాత్రలు. సాంకేతికంగా చూస్తే 1982 నేపథ్యంలో సాగిన కథను అప్పటి వాతావరణానికి తగ్గట్టుగా సన్నివేశాలను డిజైన్‌ చేశారు. ఫొటోగ్రఫీ ఓ కొత్త టోన్‌లో సాగుతుంది. రెండు ఐటమ్‌ గీతాలు ఉన్నా, ఒక్కటీ హుషారు పరిచేలా లేదు. సంభాషణలు మరింత షార్ప్‌గా రాయాల్సింది. సాధారణ కథే అయినా, దాన్ని మరింత ఆకట్టుకునేలా దర్శకుడు తీర్చిదిద్ది ఉంటే బాగుండేది.

Plus Points:

  • శివ బాలాజీ
  • రాజీవ్ కనకాల
  • సంభాషణలు

Minus Points:

  • సంగీతం
  • కథలో కొత్తదనం లేకపోవడం

Final Verdict:

ఒకప్పటి కథనంతో నడిచే “స్నేహమేరా జీవితం” సినిమా పర్లేదు.. ఓ సారి చూడొచ్చు.!

AP2TG Rating: 2.5 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top