బాహుబలిలో రానా సీన్ నచ్చలేదన్న హీరోయిన్.

విడుదలై అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న బాహుబలి చిత్రంలో ఓ సన్నివేశం పై అభ్యంతరం వ్యక్తం చేసింది సీనీనటి స్నేహా ఉల్లాల్. సినిమా అంతా బాగున్నప్పటికీ  ఒక సన్నివేశం మాత్రం బాలేదని చెప్పేసింది ఈ నీలి కళ్ల సుందరి. కాలకేయునితో యుద్దానికి వెళ్లేముందు.. రానా, ప్రభాస్ లు తమ మాయిశ్మతీ దేవతకు మొక్కి  యుద్దానికి వెళతారు. అయితే ఈ సంధర్భంలో రానా ఓ దున్నపోతు తలను  నరికి ఆ దేవతకు బలిస్తాడు. ప్రభాస్ ను కూడా నరకమని చెబితే అతను దేవత బలి కోరితే మూగ జీవి ప్రాణం ఎందుకు, ఇప్పడే వేడితో  పొంగుతున్న నా రక్తాన్ని దేవతకు నైవేధ్యంగా ఇస్తా అని తన రక్తాన్ని దేవత పాదాల మీద చల్లుతాడు.

For Face Book Updates:  బాహుబలిలో రానా సీన్ నచ్చలేదన్న హీరోయిన్.

sneha uallal comments on bahubali

అయితే స్నేహా  ఉల్లాల్ మాత్రం,  రానా దున్నను నరకడాన్ని తప్పుపడుతున్నారు. చరిత్రలో బలి గురించి  ఉన్నప్పటికీ దానిని సినిమాలో పబ్లిక్ గా అలా చూపించడం తనకు నచ్చలేదని కుండబద్దలు కొట్టింది.  తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది స్నేహా ఉల్లాల్.

bahubali sneha ullal

అయితే రాజమౌళి బలి విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు, దున్నను నరుకుతున్న షాట్ చూపించి రక్తం చిందే సీన్ ను చూపించాడు, కానీ దాని తల మీద వేటు పడిన విజువల్ ను చూపించలేదు. హీరోకు విలన్ కు మద్య తేడా చూపించడానికే రానాతో దున్నను నరికించాడు, ప్రభాస్ తో తన రక్తంతో దేవతకు నైవేద్యం పెట్టించాడు. దానికి తోడు చప్పట్లు కొట్టించే డైలాగ్ ను కూడా పెట్టేశాడు జక్కన్న ఆ  సీన్ లో.. అమ్మ బలి కోరితే మూగజీవి ప్రాణం ఎందుకు ఇప్పుడే ఉరకలేస్తున్న నా రక్తం ఇస్తా అని ప్రభాస్ చేత పలికించి ప్రేక్షకులతో  ఈలలు రాబట్టాడు రాజమౌళి.

Comments

comments

Share this post

0 Replies to “బాహుబలిలో రానా సీన్ నచ్చలేదన్న హీరోయిన్.”

  1. chandramouli obili says:

    abboooooooooo pathitha p________________
    __ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top