క్యాష్ ఎట్ హోమ్.. ATM లో డబ్బులు కట్…మీ చేతికి లిక్విడ్ క్యాష్..స్నాప్ డీల్ సరికొత్త ప్రయోగం.

నోట్ల రద్దు ప్ర‌క‌ట‌న వ‌చ్చి 40 రోజుల‌కు పైనే అవుతోంది. అయినా సామాన్య జ‌నాల కష్టాలు తీర‌డం లేదు. పాత నోట్ల డిపాజిట్ ఏమో గానీ ఆల్రెడీ డిపాజిట్ చేసిన నోట్ల‌ను విత్ డ్రా చేసుకోవాలంటే చాలా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఏటీఎంలు చాలా వ‌ర‌కు ప‌నిచేయ‌డం లేదు, బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అక్క‌డ‌క్క‌డా కొన్ని కొన్ని బ్యాంకులు, ఏటీఎంలు ప‌నిచేసినా వాటి ద్వారా కేవ‌లం రూ.2వేలు మాత్ర‌మే వ‌స్తున్నాయి. దీంతో ఏం చేయాలో, న‌గ‌దు ఎలా విత్‌డ్రా చేసుకోవాలో జ‌నాల‌కు అర్థం కావ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే వారి క‌ష్టాల‌ను పూర్తిగా కాక‌పోయినా కొంత‌లో కొంతైనా తీర్చేందుకు ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సైట్ స్నాప్‌డీల్ న‌డుం బిగించింది. అందులో భాగంగానే క్యాష్ ఎట్ హోమ్ అనే ఓ కొత్త కార్య‌క్ర‌మానికి పూనుకుంది.

snap-deal-cash-at-home
ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం ఆన్‌లైన్ షాపింగ్ విధానంలో మ‌న ఇంటికే ఏ వ‌స్తువు కావాలంటే దాన్ని కొనుగోలు చేసి తెప్పించుకునే వారం క‌దా… అందుకు గాను ముందు గానే డ‌బ్బులు క‌ట్టేవారు కొంద‌రుంటే, ఇంకొంద‌రు క్యాష్ ఆన్ డెలివ‌రీ ప‌ద్ధ‌తిలో వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేవారు. వ‌స్తువు విజ‌య‌వంతంగా చేతికి అందితేనే డబ్బు చెల్లించేవారు. అయితే ఇప్పుడు స్నాప్‌డీల్ కూడా ఇలా క్యాష్ ఆన్ డెలివ‌రీ ప‌ద్ధ‌తిలోనే కావాలనుకున్న వారికి న‌గ‌దును అందించ‌నుంది. అయితే యూజ‌ర్ ముందుగా  ఏం చేయాలంటే స్నాప్‌డీల్ సైట్‌లోకి వెళ్లి ఫ్రీ చార్జ్‌తో రూ.1 క‌నీస ఫీజు చెల్లించాలి. అనంత‌రం అడ్ర‌స్, ఇత‌ర వివ‌రాలు, న‌గ‌దు ఎంత కావాలో అందులో రిక్వెస్ట్ చేయాలి. దీంతో డెలివ‌రీ స్టార్ట్ అయిపోతుంది. యూజ‌ర్ డెలివ‌రీ అందుకున్న కొరియ‌ర్ వారు ఓ పీవోఎస్ మెషిన్‌తో అత‌ని ఇంటి వ‌ద్ద‌కే వ‌స్తారు. అప్పుడు యూజ‌ర్ తన వ‌ద్ద ఉన్న‌ ఏటీఎం కార్డును ఆ పీవోఎస్ మెషిన్‌లో స్వైప్ చేయాలి. దీంతో యూజ‌ర్ అకౌంట్ నుంచి డ‌బ్బు స్నాప్‌డీల్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది. అప్పుడు కొరియ‌ర్ స‌ర్వీస్ వారు యూజ‌ర్‌కు రిక్వెస్ట్ చేసిన మొత్తాన్ని న‌గ‌దు రూపంలో ఇస్తారు. ఓ ర‌కంగా చెప్పాలంటే యూజ‌ర్ ఆన్‌లైన్‌లో డ‌బ్బులు క‌డితే అందుకు ప్ర‌తిగా న‌గ‌దు చేతికి వ‌స్తుంద‌న్న‌మాట‌. దీనికి గాను రూ.1 చార్జి మాత్ర‌మే అవుతుంది.

అయితే స్నాప్‌డీల్ ప్రారంభించ‌నున్న ఈ క్యాష్ ఎట్ హోమ్ ముందుగా గుర్గావ్, బెంగుళూరులలో అందుబాటులోకి రానుంది. అనంత‌రం దేశంలోని ఇత‌ర న‌గ‌రాలు, పట్ట‌ణాలు… ఆ త‌రువాత గ్రామాల‌కు కూడా దీన్ని విస్త‌రించ‌నున్నారు. సో… ఇకపై మీకు న‌గ‌దు అవ‌స‌రం అయితే ఏటీఎం, బ్యాంకుల వ‌ద్ద పొడ‌వాటి లైన్ల‌లో గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షించాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌న్న‌మాట‌. ఎంచ‌క్కా మీ ఇంటి వ‌ద్ద‌కే న‌గ‌దు క్యాష్ ఆన్ డెలివ‌రీ అవుతుంది. అదే మీరు ఒక వేళ ఆఫీస్‌లో ఉంటే అక్క‌డికి కూడా న‌గ‌దును ఇలాగే తెప్పించుకోవ‌చ్చు. దీంతో ఎంతో మందికి ఉప‌యోగంగా ఉంటుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top