బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో పాముల కలకలం. ఎవరు వదిలారు?

బంజారాహిల్స్ లో మంత్రుల అధికార నివాసాల సముదాయంలో  పాముల సంచారం కలకలం రేపుతోంది. చాలా పాములు అక్కడ సంచరిస్తున్నాయన్న సమాచారం అందుకున్న జూ సిబ్బంది రంగంలోకి దిగి పాముల వేటను ప్రారంభించారు.  గడిచిన మూడు రోజులుగా మూడు పాములను కూడా పట్టుకున్నారు. ఇంకా పాముల వేట కొనసాగిస్తూనే ఉన్నారు.  ఇప్పటి వరకు రక్త పింజర, జెర్రిగొడ్డు, క్యాట్ స్నేక్ లాంటి విష సర్పాలను పట్టుకున్నారు. నాగుపాము, నల్లత్రాచుల్లాంటి అత్యంత ప్రమాదకర పాములు సైతం మినిస్టర్స్ క్వార్టర్స్ లో సంచరిస్తున్నాయనే  అనుమానంతో వాటిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు జూ సిబ్బంది.  ఈ వార్త విన్న చాలా మంది ఎవరైనా కోపంతో వీటిని అక్కడ వదిలారా..? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

12226646_698903176876223_115574133_n

12207632_698903263542881_386716848_n

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top