పాము విషంతో ఎయిడ్స్ వ్యాధిని న‌యం చేస్తున్న రామంత‌పూర్‌ ప్ర‌భుత్వ హోమియో హాస్పిట‌ల్ వైద్యులు..!

ఎయిడ్స్… ఈ వ్యాధి గురించి అంద‌రికీ తెలిసిందే. ఈ వ్యాధి గ‌న‌క ఒక్క‌సారి వ‌చ్చిందంటే ఇక రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే. దీనికి మందు లేదు. ఎప్ప‌టి నుంచో ఎయిడ్స్‌ను నిర్మూలించే మందు కోసం సైంటిస్టులు ప్ర‌యోగాలు చేస్తున్నారు కానీ అవేవీ స‌త్ఫ‌లితాల‌ను ఇవ్వ‌డం లేదు. అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్ర‌కారం… ఎయిడ్స్ వ్యాధికి మందును క‌నుగొన్నార‌నే చెప్ప‌వ‌చ్చు. అది కూడా ఎవ‌రో కాదు, మ‌న తెలుగు వారే, హైద‌రాబాద్ రామంత‌పూర్‌లోని ప్ర‌భుత్వ హోమియా ఆస్ప‌త్రి వైద్యులు నిజంగా అద్భుతం చేశారనే చెప్ప‌వ‌చ్చు. వారు క‌నుగొన్న ఓ మెడిసిన్ ఎంతో మంది ఎయిడ్స్ వ్యాధి గ్ర‌స్తుల వ్యాధిని న‌యం చేయ‌డ‌మే కాదు, తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌వారిలోనూ వ్యాధి లక్ష‌ణాలు చాలా వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌డుతున్న‌ట్టు వారు గుర్తించారు.

పాము విష‌మే మందు..!
ఆఫ్రికాలో ఎన్నో ల‌క్ష‌ల మందిని పొట్ట‌పెట్టుకున్న ఎబోలా వ్యాధి గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే ఎబోలా వ్యాధిని హోమియో ఔషధం క్రొటాలస్ హరిడస్ అడ్డుకుంది. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు వ్యాధి గురించి హైదరాబాద్‌లోని జేఎస్‌పీఎస్ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రవీణ్‌కుమార్, ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్, శాస్త్రవేత్త ప్రథమ ఓసారి చర్చిస్తుండగా.. బ్రెజిల్‌లో ఉండే ఓ పాము విషం నుంచి తయారుచేసిన క్రొటాలస్ హరిడస్ మందు ప్రస్తావన వచ్చింది. సైన్స్‌కే సవాలు విసురుతున్న ఎయిడ్స్‌ను ఈ మందుతో ఎదుర్కోగలమా? అన్న చర్చ జరిగింది. దీంతో ఐఐసీటీ శాస్త్రవేత్తలు క్రొటాలస్ హరిడస్‌పై పరిశోధనలు జరిపారు. ఈ ప‌రిశోధ‌న‌ల్లో వారికి తెలిసిందేమిటంటే… హెచ్ఐవీ వైర‌స్‌లు ఈ మందు వ‌ల్ల న‌శిస్తాయ‌ని తేల్చారు. ఎలా అంటే… ఈ క్రిములు ఉప‌యోగించుకునే రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేజ్ (ఆర్టీ) అనే ఎంజైమ్‌ను క్రొటాలస్ హరిడస్ మందు అడ్డుకుంటుంద‌ని తెలిసింది. దీంతో ఆ క్రిముల‌కు స‌దరు ఎంజైమ్ అంద‌క అవి న‌శిస్తాయి. ఇలా ప‌రిశోధ‌న స‌త్ఫ‌లితాల‌ను ఇవ్వ‌డంతో వారు త‌యారు చేసిన మందును ప‌రీక్షించ‌ద‌లిచారు. అందులో భాగంగానే క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కూడా మొద‌ల‌య్యాయి. తొలుత 9,980 మందికి ఈ మందును ఇచ్చారు. అయితే వీరిలో కొంద‌రు మాత్రమే ఆ మందును రెగ్యుల‌ర్‌గా తీసుకున్నారు. దీంతో ఆ మందును రెగ్యుల‌ర్‌గా వాడిన 2,078 మందిలో 378 మందికి వైరల్ లోడ్ జీరోకు వచ్చింది. అంటే ఎయిడ్స్ వైరస్ వారిలో పూర్తిగా తొలగిపోయింది అని వైద్య‌లు నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. దీంతో మొత్తానికి ఈ మందు అద్భుత ఫలితాన్నే ఇస్తున్నదని రోగులు కూడా చెబుతున్నారు.

పెరుగుతున్న రోగుల తాకిడి…
ఎయిడ్స్ వ్యాధి, దాని ల‌క్ష‌ణాలు త‌గ్గుతున్నాయ‌ని ఆ మందును వాడిన రోగులు చెబుతుండ‌డంతో ఈ విష‌యం తెలుసుకున్న అనేక మంది ఎయిడ్స్ వ్యాధిగ్ర‌స్తులు ఆ మందు కోసం హైద‌రాబాద్‌లోని రామంత‌పూర్‌లో ఉన్న ప్ర‌భుత్వ హోమియో హాస్పిట‌ల్‌కు క్యూ క‌డుతున్నారు. వీరికి ప్ర‌తి గురువారం ఉచితంగా ఆ మందును పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం విదేశాల నుంచి తెలంగాణ ప్ర‌భుత్వం ఆ మందును ప్ర‌త్యేకంగా తెప్పిస్తోంది కూడా. ఈ క్ర‌మంలో రోగులు పెద్ద ఎత్తున వ‌స్తుండ‌డంతో హాస్పిట‌ల్‌ను విస్త‌రించే యోచ‌న‌లో అధికారులు ఉన్నారు. కేవ‌లం తెలంగాణ‌లోని ఇత‌ర ప్రాంత వాసులే కాదు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పాండిచ్చేరి, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల‌కు చెందిన ఎయిడ్స్ వ్యాధిగ్ర‌స్తులు ఈ మందు కోసం హైద‌రాబాద్‌కు వ‌స్తున్నారు. వారి కోసం హాస్పిట‌ల్‌లో సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నారు. గురువారం రోజున ఎక్కువ డాక్ట‌ర్ల‌ను ఏర్పాటు చేసి మందును స‌ర‌ఫరా చేస్తున్నారు.

ఈ రెండూ కీల‌కం…
ఎయిడ్స్ వ్యాధి త‌గ్గుతుంద‌ని చెప్ప‌డానికి సీడీ4 కౌంట్ (తెల్లరక్తకణాల సంఖ్య), వైరల్‌లోడ్ (వైరస్ సంఖ్య)ను టెస్ట్ చేసి చూస్తారు. ఈ క్ర‌మంలో పైన చెప్పిన మందును వాడుతున్న చాలా మందిలో వైర‌స్ సంఖ్య జీరోకు రాగా, కొంద‌రికి సీడీ4 కౌంట్ పెరిగిన‌ట్టు వైద్య ప‌రీక్ష‌ల ద్వారా తెలిసింది. అంటే మందు స‌త్ఫ‌లితాల‌ను ఇస్తుంద‌ని వైద్యులు ధృవీక‌ర‌ణ‌కు వ‌చ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం సీడీ4 కౌంట్ 500పైన ఉంటే ఎయిడ్స్ లేనట్లు. అదే 200 నుంచి 500లోపు ఉంటే కొంత సమస్య ఉందని, 200 కన్నా తక్కువ ఉంటే ఎయిడ్స్ తీవ్రంగా ఉన్నట్లు పరిగణిస్తారు. రామంతపూర్ హోమియో దవాఖానకు వచ్చిన రోగుల్లో 100 నుంచి 200 సీడీ4 కౌంట్ ఉన్నవాళ్లు 507 మంది ఉండగా, 100లోపు ఉన్న వాళ్లు 308 మంది ఉన్నట్లు పరీక్షల ద్వారా తేలింది. వీరికి ప్రతీనెలా మందులు అందిస్తున్నారు. తొలుత లక్షలు, కోట్లుగా ఉన్న వైరల్‌లోడ్ మందువాడకంతో జీరోకు వస్తోంది. అయితే జోరో రావడంతోనే ఎయిడ్స్ పూర్తిగా నిర్మూలన అయిందని శాస్త్రీయంగా చెప్పలేమ‌ని, వెస్టర్న్ బ్లాట్ పరీక్షలో నెగిటివ్ అని వస్తేనే ఆ వ్యాధి నుంచి పూర్తిగా విముక్తిని పొంది ఆరోగ్యవంతుడైన వ్యక్తిగా మారినట్లు లెక్క అని వైద్యులు చెబుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top