పామును చూస్తే చాలు ఆమడ దూరం పరిగెడుతాం. అదే నాగుపామే ప్రత్యక్షమైతే ఇక ఆ పరిసరాల్లోనే జనం కనిపించరు. అంతలా ఈ విషపూరిత పాములకు భయపడతారు. కానీ వింతగా ఇటీవల కర్ణాటకలో ఓ నాగుపాము ఏకంగా వాటర్ బాటిల్ లో నీళ్లు తాగింది. తరవాత ఓ నాగుపాము ముళ్ళపందిని తిని ఎన్నో ఇబ్బందులు పడింది. ఈ రెండు వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి ఇంతలో మరో వింత చోటు చేసుకుంది. ఎండాకాలంలో చలువ చేయడంకోసం కొంతమంది కల్లు తాగుతుంటారు. కానీ పాము కూడా తాగుతుంది అంటే నమ్మగలరా. నమ్మకతప్పదు అండి. ఓ పాము కల్లు తాగే దృశ్యం కెమెరాకు చిక్కింది. పాము చెట్టుపైకి ఎలా రింగులు రింగులు తిరుగుతూ ఎక్కిందో వీడియోలో చూడండి!
watch video here:
ఈతచెట్టుకు కట్టిన లొట్టిలోకి వెళ్లి మరీ కల్లు తాగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ సమీపంలో జరిగిన ఈ చిత్రాన్ని.. స్థానికులు సెల్ కెమెరా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పోశారు. ఈతచెట్టు ఎక్కిన నాగుపాము.. ఎండకు తట్టుకోలేక.. కల్లు కోసం కట్టిన లొట్టిలోకి వెళ్లింది. చాలా సేపు అలాగే ఉండిపోయింది. కింద ఉన్న యువకులు శబ్దాలు చేసినా అది పోలేదు. 10నిమిషాలు కల్లు తాగిన పాము.. తీరిగ్గా కిందకి దిగి వెళ్లిపోయింది.