ఆకలేసి “ముళ్ళపంది”ని తినింది ఆ “పాము”…తరవాత చర్మంలోనుంచి ముళ్ళు పైకొచ్చి ఇబ్బంది పడింది..! [VIDEO]

పామును చూస్తే చాలు ఆమ‌డ దూరం ప‌రిగెడుతాం. అదే నాగుపామే ప్ర‌త్య‌క్ష‌మైతే ఇక ఆ ప‌రిస‌రాల్లోనే జ‌నం క‌నిపించ‌రు. అంత‌లా ఈ విష‌పూరిత పాముల‌కు భ‌య‌ప‌డ‌తారు. కానీ క‌ర్నాట‌క రాష్ట్రంలోని కైగా ప‌ట్ట‌ణంలో మాత్రం ఓ పేద్ద నాగుపాము నీళ్లు తాగింది. నీళ్లు తాగ‌టంలో వింతేముంది అంటారా..? వాటర్ బాటిల్‌తో ఒక వ్య‌క్తి నీళ్లు ప‌డుతుంటే ఎంచ‌క్కా ప‌డ‌గ విప్పి నోటితో తాగింది. సామాన్యంగా జ‌న‌సంచారంలోకి వ‌చ్చేందుకు భ‌య‌ప‌డే పాములు… చుట్టుప‌క్క‌ల జ‌నం గుమికూడి ఉన్నాకూడా ఈ పాము ముందు దాహం తీర్చుకునేందుకే ప్రాధాన్య‌త ఇచ్చింది.

ఇదే ఒక వింత అనుకుంటే ఇటీవల బ్రెజిల్ లో మరో వింత చోటు చేసుకుంది. బ్రెజిల్ దేశంలో ఓ కొండ‌చిలువ క‌డుపుకాలి ఆక‌లిగా ఉండగా దానికి ఓ ముళ్ల‌పంది క‌నిపించింది. కనిపించిందే ఆలస్యం ఒక్క గుటుకలో మింగేసింది. ఆ తరువాత ఎన్నో ఇబ్బందులు పడింది. ఎటూ క‌ద‌ల‌లేని ప‌రిస్థితి. పైగా ముళ్ల‌పంది ముళ్లులు చ‌ర్మంపై చొచ్చుకుపోవ‌డంతో తెగ ఇబ్బంది ప‌డిపోయింది. ఇలా ఇబ్బంది ప‌డుతున్న పాము ఓ ఫోటో గ్రాఫ‌ర్ కంట ప‌డింది. వెంట‌నే దాన్ని షూట్ చేశాడు. త‌న‌తో పాటు ఉన్న కుక్క అయితే ఆ పామును చూసి తెగ మొరిగింది. కుక్క దాడి చేస్తుందేమో అన్న‌ట్లుగా త‌న‌ను తాను కాపాడుకునేందుకు ఆ కొండ‌చిలువ ముడుచుకుంది. ఆ క్ర‌మంలో చ‌ర్మంపై ఉన్న ముళ్లులు కుచ్చుకోవ‌డంతో మరింత ఇబ్బంది ప‌డింది.

మింగిన ముళ్ల‌పంది అరిగేందుకు క‌నీసం నాలుగు నుంచి ఆరు రోజులు ప‌డుతుంద‌ట‌. అంటే అంత‌వ‌ర‌కు ఈ కొండ‌చిలువ‌కు న‌ర‌కం త‌ప్ప‌ద‌న్న‌ట్లే. ప్రాణం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కొందరు పాము బాధను చూసి జాలిపడితే మరికొందరు వెటకారంగా కామెంట్స్ కూడా చేసారు!

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top