మొన్న “మిథాలీ” రిపోర్టర్ చెంప చెల్లుమనిపిస్తే.! ఇప్పుడు “స్మ్రితి మదాన” దాన్ని మించి ఏమందో తెలుసా?

జోరుమీదున్న భారత్‌.. మహిళల ప్రపంచకప్‌లో మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొంటుంది. అన్ని రంగాల్లోనూ తిరుగులేని ఫామ్‌లో ఉన్న భారత్‌ ఈ మ్యాచ్‌లో స్పష్టమైన ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. టోర్నీలో భారత్‌ తన తొలి రెండు మ్యాచ్‌ల్లో చక్కని విజయాలు సాధించింది. తొలి మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో బలమైన ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది. మరోవైపు సనా మిర్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ఇంకా బోణీ కొట్టలేదు. దక్షిణాఫ్రికా చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓడిన ఆ జట్టు.. ఇంగ్లాండ్‌ చేతిలో 107 పరుగుల తేడాతో భారీ పరాజయం చవిచూసింది. ఎలాగైనా తొలి విజయం సాధించాలని ఆరాటపడుతున్న పాక్‌కు భారత్‌ను ఓడించడం కష్టమై పనే. భారత్‌ అన్ని రంగాల్లోనూ చక్కని ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో స్మృతి మందాన అదరగొడుతోంది.

ప్రపంచ కప్ మొదలవ్వకముందు ప్రెస్ మీట్ లో రిపోర్టర్ కు భారత మహిళా క్రికెట్ సారధి “మిథాలీ రాజ్” ఎలా చంప పగిలేలా సమాధానం ఇచ్చిందో అందరికి తెలిసిందే.

రిపోర్టర్: భారత్, పాక్ జట్లలో మీ అభిమాన క్రికెట్ ఆటగాడు ఎవరు?
మిథాలీ: ఎవరైనా ఆటగాడిని మీ అభిమాన మహిళా క్రికెటర్ ఎవరు అని మీరు అడగగలరా? ఎవరైనా ప్రశ్న అడిగేటప్పుడు మీ అభిమాన క్రికెటర్ ఎవరు? అని అడుగుతారే తప్ప, మీ అభిమాన మహిళా క్రికెటర్ ఎవరు? అని అడుగుతారా? ఎక్కడైనా? ఇండియాలో మెన్స్ క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మాకు లేదు. మ్యాచ్‌లు ఆడినా మేము టీవీల్లో కనిపించము.

ఇప్పుడు మరోసారి ప్రపంచ కప్ లో అత్యుత్తమ పెర్ఫార్మన్స్ తో దూసుకుపోతున్న “స్మ్రితి మందాన” కూడా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చింది.

రిపోర్టర్: ఇండియా ఈ సారి ప్రపంచ కప్ గెలవగలదు అనుకుంటారా?
స్మ్రితి: ఎందుకు? మీరు గెలవారా?

ఆ సమాధానంకి ఫిదా అయిన బీబీసీ రిపోర్టర్ ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించాడు.

ఇంతటితో తాను ఆగబోనని స్మృతి ఇప్పటికే ప్రత్యర్థులను హెచ్చరించింది. ‘‘నేను ఇంకా సంతృప్తి చెందలేదు. భారత్‌ తరఫున మరింత మెరుగ్గా రాణించాలనుకుంటున్నా. ప్రపంచకప్‌ గెలవాలన్నది నా ఆశయం. అందుకోసమే నేను గత ఐదు నెలలుగా కష్టపడుతున్నా’’ అని ఆమె చెప్పింది.

Comments

comments

Share this post

scroll to top