స్మార్ట్ ఫోన్ ఇలా యూజ్ చేస్తే మీ రెండు కళ్ళు పోయినట్టే.. నిపుణుల హెచ్చరిక!!

స్మార్ట్ ఫోన్ అరచేతిలో ఉంటే చాలు ప్రపంచాన్నే మర్చిపోతుంటారు యువత. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాతో ఎప్పుడు బిజీ బిజీగా ఉంటారు. రేడియేషన్, గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడటం వల్ల ఎన్ని సమస్యలు వచ్చిన స్మార్ట్ ఫోన్ వినియోగం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. పబ్జీ అనే గేమ్ కి బానిస అయ్యి యువత చనిపోతున్న పట్టించుకోవడం లేదు.

ఇవన్నీ ఓ ఎత్తయితే తైవాన్ లో జరిగిన ఓ ఘటన మరో ఎత్తు. ఇంతకీ ఎం జరిగిందంటే తైవాన్ లో చెన్ అని పాతికేళ్ల యువతి తీవ్రమైన కంటి నొప్పితో హాస్పిటల్ కి వెళ్ళింది. దింతో ఆమెకి ప్రాథమిక చికిత్స చేశారు. అయిన సమస్య ఏంటో తెలవకపోవడంతో కర్నియా టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన డాక్టర్లు షాక్ కి గురయ్యారు. ఆమె రెండు కళ్లలో కార్నియా తీవ్రస్థాయిలో దెబ్బతిన్నట్టు వైద్య పరీక్షలో తేలింది. రెండ్ కార్నియాల్లో దాదాపు 500 సూక్ష్మరాంధ్రాలు చూసి నివ్వెరపోయారు. అందుకు కారణమేమిటంటే మొబైల్ ను ఫుల్ బ్రైట్ నెస్ తో చూడటమే కారణమని గుర్తించారు. సాధారణంగా ఫోన్ బ్రైట్ నెస్ వాల్యూ 300ల్యూమెన్స్ మాత్రమే ఉండాలి. కానీ చెన్ ఉపయోగించిన ఫోన్ లో అది రెట్టింపు స్థాయిలో ఉందట. రెటీనా కూడా అదేస్థాయిలో దెబ్బతిన్నట్టు గుర్తించారు డాక్టర్లు.

ఇంతకీ ఆమె వాడుతున్న ఫోన్ వివరాలు మాత్రం తెలియలేదు. ఇటీవల మన దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. నిపుణులు మాత్రం తక్కువ రేడియేషన్ ఉన్న మొబైల్స్ వాడాలి అని అంటున్నారు, బ్రైట్ నెస్ మీడియం రేంజ్ లో సెట్ చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top