త‌గ్గ‌నున్న ఫోన్ రేట్లు..! ప‌ది వేల ఫోన్….తొమ్మిది వేల‌కే రానుంది.!!

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు మొబైల్ ఫోన్ రేట్లు త‌గ్గనున్నాయి. మొబైల్ ఫోన్స్ పై వేసే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ను 14.5% నుండి 5% కు త‌గ్గిస్తూ తీసుకున్న ఈ నిర్ణ‌యం మేర‌కు ప‌దివేల రూపాయ‌ల ఫోన్ తొమ్మిది వేల‌కే రానుంది. అంటే ప్ర‌తి ఫోన్ రేట్ 9.5 శాతం వ‌ర‌కు త‌గ్గ‌నుంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా, అందరికీ సౌకర్యవంతంగా ఉండాలనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని తెలంగాణ రాష్ట్ర మంత్రి త‌ల‌సాని తెలిపారు.క్యాష్ లెస్ ట్రాన్జాక్ష‌న్ లో……స్మార్ట్ ఫోన్ల అవ‌స‌రం ప్రాముఖ్య‌త సంత‌రించుకున్న ఈ స‌మ‌యంలో…తెలంగాణ రాష్ట్రం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం.

samrt-phones

వ్యాట్ గురించి మ‌రికొంత స‌మాచారం:
వ్యాట్‌ను తొలిసారిగా 1954లో ఫ్రాన్స్‌లో ప్రవేశపెట్టారు. మన దేశంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తొలిసారిగా ఎల్ కె ఝూ కమిటీ సూచించింది. ఎల్ కె ఝూ సూచనల మేరకు మ్యాన్యుఫాక్చరింగ్ రంగంలో వెూడ్ వ్యాట్ టాక్స్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1991లో రాజా చెల్లయ్య అధ్యక్షతన పనిచేసిన పన్నుల సంస్కరణ కమిటీ కేంద్రీకృత వాల్యు యాడెడ్ ట్యాక్స్‌ను సూచించింది
మన దేశంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను అమలు చేసిన మొదటి రాష్ట్రం హర్యానా. చివరిగా వ్యాట్‌ను ఆమోదించిన రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. ఇక కేంద్రపాలిత ప్రాంతాలైన పాండిచ్చేరి, అండమాన్, లక్షదీవులలో అమ్మకం పన్ను అమలులో లేనందున వ్యాట్ అమలులో లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్‌ 2005 ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో రూ. 5 లక్షలలోపు టర్నోవర్ కలిగిన వ్యాపారస్తులకు వ్యాట్ నుండి మినహాయింపు ఉంది.

Comments

comments

Share this post

scroll to top