ఒక స్మార్ట్ ఫోన్ యూజ‌ర్..రోజుకి త‌న ఫోన్ ను ఎన్ని సార్లు ట‌చ్ చేస్తాడో తెలుసా???

Siva Ram

760 కోట్ల ప్ర‌పంచ జ‌నాభాలో దాదాపు 30 శాతం మంది స్మార్ట్ ఫోన్స్ ను వాడుతున్నారు.. అంటే 228 కోట్ల మంది చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంద‌న్న‌మాట‌.! ఉద‌యం లేచింది మొద‌లు ప‌డుకునే వర‌కు విజ్ఞానం కోస‌మైతేనేమి, వినోదం కోస‌మైతేనేమి, స్నేహితులు, బంధువుల‌తో ట‌చ్ లో ఉండ‌డం కోస‌మైతేనేమీ…స‌గ‌టున ప్ర‌తి స్మార్ట్ ఫోన్ యూజ‌ర్ త‌న స్మార్ట్ ఫోన్ ను దాదాపు రోజుకు 2617 సార్లు ట‌చ్ చేస్తార‌ట‌.! ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది వాస్త‌వ‌మే.! అంతే కాదు ప్ర‌తి ఒక్క స్మార్ట్ ఫోన్ యూజ‌ర్ రోజులో 5 గంట‌లు త‌మ త‌మ ఫోన్ తోనే గ‌డుపుతున్నార‌ట‌.!

స్మార్ట్ ఫోన్ల‌ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్న టాప్ -3 దేశాలు.

  1. చైనా- 70 కోట్లు
  2. ఇండియా -30 కోట్లు
  3. అమెరికా -20 కోట్లు.

దేని మీద ఎక్కువ‌గా టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

  1. బ్రౌజింగ్ -28 శాతం
  2. ఫేస్ బుక్ – 13శాతం.
  3. వాట్సాప్ – 10 శాతం.

Comments

comments