ఆ చిన్నారి పుట్టుకతోనే గర్భావతి…అందులోనూ కవలలు. వింత ఘటన.!?

వైద్యశాస్త్రంలో ఎన్నో రకాల వింతలు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఒకేసారి ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వడం, పుట్టుకతోనే వైకల్యం కలిగి ఉండడం, అదనపు అవయవాలతో జన్మించడం… ఇలా ఎన్నో రకాలుగా శిశువులు జన్మిస్తారు. కానీ చైనాలో జరిగిన ఈ సంఘటన వైద్య శాస్త్ర చరిత్రలోనే ఒక అరుదైన కేస్‌గా నిలిచింది. హాంగ్‌కాంగ్‌లోని క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్‌లో ఓ శిశువు పుట్టుకతోనే గర్భిణీలా జన్మించింది. ప్రెగ్నెంట్ అయిన స్త్రీలు ఉన్న మాదిరిగానే పొట్టంతా పెద్దదిగా ఉండి పుట్టింది. వైద్యులు ఆ శిశువుకు పరీక్షలు నిర్వహించగా ఆ పాప కడుపులో మరో ఇద్దరు కవల పిల్లలు పిండాల రూపంలో ఎదుగుతున్నట్టు తెలిసింది.
వైద్యశాస్త్రంలో దీన్ని ఫీటస్ ఇన్ ఫిటు (Fetus in fetu) కండిషన్‌గా చెబుతున్నారు. అంటే పిండంలో పిండం అన్నమాట.
mv0580uc0slsfhmg733e
ఇలా జన్మించిన పాపకు 3 వారాల వయస్సు రాగానే వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఆమె కడుపులో ఉన్న పిండాలను తొలగించారు. అప్పటికి ఆ పిండాల వయస్సు 8 నుంచి 10 వారాలుగా ఉంది. వాటిని తొలగించక ముందు వరకు అవి ఆ పాప గర్భంలో పెరుగుతూనే ఉన్నాయి.
2vneqajnaeb02pwjfr2y
వైద్యశాస్త్రంలో ఇలాంటి పరిస్థితి దాదాపు అత్యంత అరుదుగా ఏర్పడుతుందని వైద్యులు సెలవిస్తున్నారు. దాదాపు ప్రతి 5 లక్షల జననాల్లో ఒకరికి ఈ విధంగా జరుగుతుందని అంటున్నారు.
తల్లి గర్భంలో ఒకవేళ మూడు పిండాలు ఎదిగితే వాటిలో ఆరోగ్యంగా ఎదిగే ఓ పిండం మిగతా వాటిని తనలో కలిపేసుకుంటుంది. ఈ పాప విషయంలోనూ అదే జరిగి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.
7aopqkzfv52oe5xc0r5k
2012లోనూ దాదాపు ఇలాంటి సంఘటనే చైనాలో చోటు చేసుకుంది. ఓ 11 ఏళ్ల బాలిక వెన్నెముకలో చేయి, స్తనం పుట్టుకువచ్చాయి. దీన్ని కూడా పైన పేర్కొన్న ఫీటస్ ఇన్ ఫిటు కండిషన్‌గానే భావిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top