పది సంవత్సరాల క్రితం జరిగిన ఘటనతో 23 ఏళ్ల సప్న జీవితం ఒక్క సారిగా తలక్రిందులైంది. అప్పుడే స్కూల్ లైఫ్ పూర్తి చేసుకున్న సప్న కు పెళ్లి చేయాలని నిశ్చయించారు తల్లిదండ్రులు ఈ మేరకు ఓ సంబంధం కూడా ఖాయం అనుకున్నారు.. కానీ ఉన్నత చదువులు చదవాలనే కోరికతో పెళ్లికి నో చెప్పింది సప్న… ఈ సమయంలోనే మరో అబ్బాయితో క్లోజ్ గా ఉంటున్న సప్న మీద ఆమె సమీప బంధువు…… ఒంటరిగా వెళుతున్న సమయంలో యాసిడ్ తో దాడి చేశాడు. విలవిల్లాడుతూ అక్కడే పడిపోయింది సప్న.
సీన్ కట్ చేస్తే..
10 ఏళ్లుగా నరకం అనుభవించిన సప్న.. తనలా ఎవరు బాధపడకూడదని నిర్ణయం తీసుకుంది. తనలా బాధపడే యాసిడ్ బాధితులనందరిని ఒక్క చోటకు చేర్చి ఉద్యోగాలను తమ దరికి తీసుకు వచ్చేలా చేస్తోంది. ఉన్నత చదువులతో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆరాటపడి.. అనూహ్య రీతిలో ‘యాసిడ్ రక్కసి’కి బలైపోయిన వారికి ఓ దారిని చూపించే నిర్ణయం తీసుకుంది. అందుకోసం మేకిన్ లవ్ నాట్ స్క్వార్ అనే టైటిల్ తో ప్రపంచంలోనే తొలిసారిగా యాసిడ్ బాధితుల జాబ్ పోర్టల్ ను సిద్దం చేసింది. #SkillsNotScars అనే నినాదంతో దూసుకుపోతున్న ఈ పోర్టల్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకోసం తను రూపోందించిన వీడియో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారి ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది.