సైజ్ జీరో రివ్యూ & రేటింగ్ తెలుగులో…పేరులోని భారీతనం.. సినిమాలో జీరో ఎంటర్ టైన్ మెంట్.

Size-Zero-Movie-Wallpapers-03-1024x766

Cast & Crew:
నటీనటులు: అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, ఊర్వశి..
దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
నిర్మాత: ప్రసాద్ వి పొట్లూరి

Story:

స్వీటీ అలియాస్ సౌందర్య(అనుష్క)కు చిన్నప్పటి నుండి బాగా తిండి పిచ్చి. ఏజ్ పెరిగే కొద్దీ తన శరీర బరువుకూడా పెరుగుతుంది. ఎలాగైనా స్వీటీకి పెళ్లి చేయాలని తల్లి (ఊర్వశి) స్వీటీకి ఎన్నో సంబంధాలు తీసుకువస్తుంది. ప్రతి ఒక్కరూ ఆమె లావుగా ఉన్న కారణంతో రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఫారెన్ నుండి ఇండియా వచ్చిన అభి (ఆర్య) స్వీటీని ఇష్టపడతాడు. లావుగా ఉందని సన్నబడాలని స్వీటీ పేరెంట్స్ కి చెప్పి వెళ్ళిపోతాడు అభి. అభి లైఫ్ లోకి సిమ్రాన్ (సోనాల్ చౌహాన్) ఎంటర్ అవుతుంది. అభి, సిమ్రాన్ లు క్లోజ్ గా మూవ్ అవుతుండటం చూసి తట్టుకోలేని స్వీటీ ఎలాగైనా సన్నబడి అభిని దక్కించుకోవాలని సత్యానంద్ (ప్రకాష్ రాజ్) ఫిట్ నెస్ సెంటర్ లో జాయిన్ అవుతుంది. సైజ్ జీరో కోసం సన్నబడటానికి ఫిట్ నెస్ సెంటర్ లో జాయిన్ అయిన స్వీటీ అక్కడ కొన్ని నిజాలు తెలుసుకొని.. అభి, సిమ్రాన్ ల సహకారంతో ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. స్వీటీ అక్కడ చూసిన సమస్య ఏంటి? స్వీటీ బరువు తగ్గి అభిని దక్కించుకుందా. అనేది మిగిలిన కథ.

PLUS POINTS:
అనుష్క
కీరవాణి నేపధ్య సంగీతం
స్టార్ హీరో, హీరోయిన్స్ స్పెషల్ అప్పీయరన్స్

MINUS POINTS:
సెకండాఫ్
స్క్రీన్ ప్లే
క్లైమాక్స్
పండని ఎమోషనల్ సీన్స్
దర్శకత్వం
Verdict: అనుష్క నటన కోసం ఒకసారి చూడవచ్చు. పేరులోని భారీతనం.. సినిమాలో జీరో ఎంటర్ టైన్ మెంట్.
Rating: 2.5/5

Trailer: 

 

Comments

comments

Share this post

scroll to top