“శివరాత్రి”కి ఉపవాసం ఉన్నారా?…అయితే ఏ ఏ ఆహార ప‌దార్థాలు తినొచ్చో చూడండి!

“శివరాత్రి” అనగానే మనకి గుర్తొచ్చేది “ఉపవాసం” మరియు “జాగారం”. శివుని పై భక్తితో ధ్యానించుకుంటూ ఉండిపోతారు భక్తులు అందరు. ఉదయాన్నే తలంటు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళి పాలు మరియు తేనతో శివలింగానికి అభిషేకం చేసి రోజంతా గుడిలో సమయం గడుపుతారు శివ భక్తులు అందరు. కానీ ప్రస్తుతం ఉపవాసం ఉండాలనుకునే వారు ఎన్నో అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. అందులో అధికంగా షుగర్ వ్యాధి. అయితే ఉపవాసం ఉండే వారిలో కొంతమంది  రోజంతా కనీసం మంచినీళ్లు కూడా తాగారు. మరికొంతమంది పాలు, పండ్లు సేవిస్తారు. కానీ శివరాత్రి రోజు కొన్ని పదార్తాలను తిన్నా  కూడా ఉపవాసం ఉన్న ఫలితమే వస్తుంది. ఉపవాసం ఉన్న వారు ఏ ఏ ఆహారాలు తినవచ్చు ఒకసారి చూడండి!

  • సొరకాయ హల్వా
  • కాజు కట్లీ
  • ఆలూ కిచిడి
  • సగ్గుబియ్యం పాయసం
  • పెరుగు మరియు కూరగాయలు కలిపి చేసే రైతా
  • పచ్చి పులుసు లేదా రసం
  • మొక్కజొన్న పిండితో చేసే రొట్టలు
  • మజ్జిగ
  • అరటిపండు వడలు
  • బాదాం హల్వా

ఉపవాసం ఉన్న వారు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరవాత శివునికి పూజ చేసి పాలు మరియు పండ్లు సేవించచ్చు. పండ్లలో ముఖ్యంగా “పుచ్చకాయ, బొప్పాయి, దానిమ్మ, సంత్ర, ఆపిల్, చిలకడదుంప, కజ్జుర్, ద్రాక్ష” ఇలా అధిక శక్తిని ఇచ్చేవి తినాలి. సాయంత్రం పండ్లు తిన్నతరవాత మల్లి మరుసటిరోజు ఉదయం స్నానం చేసిన తరవాత ఆహరం సేవించాలి.

Comments

comments

Share this post

scroll to top