“బిగ్ బాస్ ఫేమ్ శివ బాలాజీ” పెళ్లి వీడియో ఫేస్బుక్ లో వైరల్..కారణం పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ ఉండటం! [VIDEO]

శివబాలాజీ పరిచయం అక్కర్లేని తెలుగు నటుడు.అశోగ్గాడి లవ్ స్టోరీ సినిమాతో తెరంగేట్రం చేసినప్పటికి ఆర్యా సినిమా శివబాలాజీకి మంచి గుర్తింపు తెచ్చింది.చందమామ,పోతేపోనీ సినిమాలతో పాటు సంక్రాంతి,అన్నవరం,శంభో శివ శంబో లాంటి మల్టీస్టారర్ సినిమాలు కూడా చేసి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.ఇటీవలప్రారంభమైన  బిగ్ బాస్ షో లో పార్టిసిపెంట్ గా ఉన్నారు..ఇప్పటికే ఎనిమిదిమంది ఎలిమినేట్ అయినా పోటీ తట్టుకుంటూ  కంటెస్టెంట్ గా  కొనసాగుతున్నారు..

బిగ్ బాస్ లో అడుగుపెట్టిన తర్వాత కంటెస్టెంట్స్ అందరి గురించి సోషల్ మీడియాలో ప్రేక్షకులు తెగ వెతుకుతున్నారు.ముఖ్యంగా కంటెస్టెంట్స్ పర్సనల్ లైఫ్స్ గురించి ,వారి ఫ్యామీలి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ కనబరుస్తున్నారు.అలా బయటపడిందే ఎప్పుడో శివబాలాజీ ఎఫ్బీలో అప్లోడ్ చేసిన వారి పెళ్లి వీడియో..శివబాలజీ మధుమిత ( స్వప్న మాధురి)ని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసింది.స్వప్న మాదురి కూడా మనకు సుపరిచితమే..పుట్టింటికి రా చెల్లిలో తన నటనతో అందరి చేత కన్నీరు పెట్టించింది.పెళ్లి తర్వాత సినిమాల్లో నటించనప్పటికి చాలా గ్యాప్ తర్వాత భలే భలే మగాడివోయ్ లో కనిపించింది.వీరికి గగన్,ధన్విన్ అని ఇద్దరు పిల్లలున్నారు..2009లో జరిగిన శివబాలజీ పెళ్లికి సినిమా నటులు చాలా మందే హాజరయ్యారు..ఇంట్రస్టింగ్ టాపిక్ ఏంటంటే సాధారణంగా ఏ ఫంక్షన్లో కనపడని పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ అయ్యారు.అంతేకాదుకళ్యాణ్ రామ్,నితిన్,అచ్చిరెడ్డి,ఎస్వీ కృష్ణారెడ్డి, రాజీవ్ కనకాల,సుమ కనకాల,హేమ మరింత మంది హాజరయ్యారు..అంతేకాదు మనం మిస్ అయిన లవర్ బాయ్ అదేనండి ఉదయ్ కిరణ్ తోపాటు ,దివంగతులైన దాసరి నారాయణరావు, శ్రీహరీ,ఆహుతి ప్రసాద్   కూడా ఉన్నారు… ఆ వీడియో పై మీరు ఓ లుక్కేయండి ఎందుకంటే..

watch video here:

Glimpse of Wedding ceremony

Sharing my very special moments from my wedding for the first time for all of you… Nostalgic… Thanks to each and every one for the blessings 🙂

Posted by Sivabalaji on Sunday, 1 March 2015

Comments

comments

Share this post

scroll to top