మంత్రి కనిపిస్తే చాలు, అధికారుల దగ్గర నుండి పోలీసుల వరకు వంగి,వంగి దండాలు పెట్టే వారిని చాలా మందినే చూశాం, కానీ ఢిల్లీ ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం ఉప ముఖ్యమంత్రి చేతే ఫైన్ కట్టించారు. దాదాపు గంట సేపు వెంబడించి మరీ మంత్రి కార్ ను ఆపి చలాన్ రాసి చేతి లో పెట్టారు.
ఢిల్లీ రోడ్డు పై ట్రాఫిక్ నిబంధనలను అందరూ ఖచ్చితంగా పాటించాల్సిందే. జూన్ 12 సాయంత్రం ఖజూరి ఖాస్ చౌక్ వద్ద ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా ప్రయాణిస్తున్న కారు పరిమితి కి మించిన వేగంతో దూసుకుపోతోంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఆ కార్ ను సుమారు గంట పాటు వెంబడించి కారును ఆపి 400 రూపాయలు జరిమానా వేశారు. ఈ విషయాన్ని సీనియర్ ట్రాఫిక్ పోలీస్ అధికారి వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసులు వారి డ్యూటీ వారు చేశారని చెప్పారు.