అసలు ఎవరీ “శిరీష”..? ఎస్సై తో ఎలా పరిచయం..? ఇద్దరి ఆత్మహత్య మిస్టరీ ఏంటి..? ఇవే వివరాలు..!

మూడు రోజుల కింద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తెలుగు సినిమా పరిశ్రమలో పని చేసే బ్యూటిషన్ శిరీష కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఈమె మృతితో కుకునూరుపల్లి ఎస్సైకి సంబంధాలున్నాయని ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవడం దీనికి కారణం. కానీ వారిద్దరికీ ఎలా పరిచయం..? అసలు శిరీష ఎవరు..? ఎస్సై ప్రభాకర్ చాలా మంచివాడు అని అందరు అంటున్నారు..! మరి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు..?

>>>శిరీష కేసులో కొత్త ట్విస్ట్..! బయటపడ్డ “రాజీవ్” చరిత్ర..! నాలుగు నెలలకు ఓ గర్ల్ ఫ్రెండ్, తప్పించుకునేందుకు ఉద్యోగం!<<<

శిరీష మరణించే ముందు భర్తతో ఏం మాట్లాడింది..?

సోమవారం అర్ధరాత్రి శిరీష తన భర్తకు ఫోన్ చేసింది. కానీ భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మిస్డ్ కాల్ చూసుకొని ఫోన్ చేస్తే ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పింది శిరీష. శిరీష భర్తకు రాజీవ్ పై అనుమానం ఉందంట. శిరీష ఫోన్ పోలీసుల దగ్గర ఉంది. శిరీష తన కూతురికి కూడా ఫోన్ చేసింది. కానీ నిద్రలో ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పొద్దున్న లేచే సరికి తన తల్లి చనిపోయిందని వార్త తెలుసుకొని షాక్ అయ్యింది శిరీష కూతురు.

అసలు ఎవరు ఈ శిరీష..?

రాయచూరు కి చెందిన గంగావతి గ్రామం కి చెందిన తెలుగు అమ్మాయి శిరీష. 2004 లో ఆమెకు సతీష్ చంద్రతో వివాహం జరిగింది. ఆమె గుల్బర్గా వర్సిటీలో పిజి స్టూడెంట్. ఆ తర్వాత ఆర్జే ఫోటోగ్రఫీ యజమాని వల్లభనేని రాజీవ్ వద్ద బ్యూటీషియన్‌గా, హెచ్‌ఆర్‌గా పని చేస్తోంది. రాజీవ్‌కు చెందిన రెండు సంస్థలకు ఆమె హెచ్‌ఆర్‌గా ఉంటోంది.

ఎస్సై ప్రభాకర్ రెడ్డి తో ఎలా పరిచయం..?

శిరీష యజమాని రాజీవ్, ఎస్సై ప్రభాకర్ స్నేహితులు. దీంతో ప్రభాకర్ రెడ్డికి, శిరీషకు కూడా పరిచయం ఏర్పడిందని అంటున్నారు. రెండు రోజుల క్రితం శిరిష, రాజేష్, స్నేహితుడు శ్రవణ్ కలిసి కుకునూరుపల్లి వెళ్లారని అంటున్నారు. మరోవైపు ఎస్సై ప్రభాకర్ రెడ్డియే హైదరాబాద్ వచ్చారనే ప్రచారం కూడా సాగుతోంది.

పోస్ట్‌మార్టం రిపోర్టు:

మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో శిరీష మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు.. గురువారం సాయంత్రం నివేదికను పోలీసులకు అందజేశారు. ఆ రిపోర్టులో పలు సంచలన అంశాలను పేర్కొన్నారు.శిరీష మెడ, పెదవి, చెంపలపై బలమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెడ భాగంలో తీవ్రమైన ఒత్తిడి కలగడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.రీషది ఆత్మహత్యా లేక హత్యా అనేదానిపై స్పష్టత రావాలంటే మరికొన్ని టెస్టులు చేయాలన్నారు. ఎస్సై ప్రభాకర్ ఆత్మహత్యకు , శిరీష కు సంబందం ఉందాలేదా అనేది ఇంకా తెలియదు!

అసలేం జరిగిందంటే:

రాజీవ్‌, శిరీషల పంచాయతీ తేల్చడానికి శ్రవణ్‌ సోమవారం హైదరాబాద్‌ వచ్చాడు. ముగ్గురూ కలిసి మద్యం తాగుతూ మాట్లాడుకున్నారు. పోట్లాడుకున్నారు. సమస్య ఎంతకూ తెగకపోవడంతో మద్యం మత్తులోనే కారులో కుకునూర్‌పల్లి బయల్దేరారు. రాత్రి ఏడు గంటలకు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయానికి అక్కడ వర్షం పడుతోంది. స్టేషన్లో కాసేపు కూర్చొని ఎస్సైతోపాటు ఆయన క్వార్టర్లోకి వెళ్లారు. చికెన్ తెప్పించుకొని. నలుగురు కలిసి తిన్నారు.

>>>బ్యూటీషియన్ శిరీష ఇలా చనిపోయింది..! లైవ్ ప్రెస్ మీట్ లో సీపీ..! శ్రవణ్, రాజీవ్ అరెస్ట్!<<<

భోజనాలయ్యాక శిరీష తన గోడంతా చెప్పేలోగా.. ‘మీరు ‘ఎంజాయ్‌’ చేయడానికి రామచంద్రాపురం వెళ్లిరండ’ని ఎస్సై ప్రభాకర్‌రెడ్డి రాజీవ్‌, శ్రవణ్‌లను బయటకు పంపించారు. ఆ తర్వాత రెండు గంటలపాటు ఎస్సై, శిరీష మాత్రమే క్వార్టర్స్‌లో ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ, పెనుగులాట జరిగినట్లు తెలుస్తోంది. శిరీష పెద్దగా కేకలు వేయడంతో రామచంద్రాపురం వెళ్లిన శ్రవణ్‌, రాజీవ్‌లను ఎస్సై వెనక్కి పిలిపించారు. వారు రాగానే ఆమెను తొందరగా తీసుకెళ్లండంటూ బలవంతంగా కారులో ఎక్కించి పంపించేశారు. కారులో వెళుతుండగా శిరీషను ఇద్దరూ కొట్టినట్లు సమాచారం. దీనిని అవమానంగా భావించిన శిరీష గదిలో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు శిరీష.. రాజీవ్‌కు వీడియోకాల్‌ చేసిందని వార్తలు వస్తున్నాయి. శిరీష చనిపోయిన ప్రదేశంలో నిన్న 7 గంటల పాటు క్లూస్‌ టీమ్‌, ఫోరెన్సిక్‌ నిపుణుల పర్యవేక్షణలో విచారణ జరిగింది.

Comments

comments

Share this post

scroll to top