భర్త శ్రీకాంత్ తనను వేధిస్తున్నాడంటూ హైద్రాబాద్ హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది వర్థమాన గాయని మధుప్రియ. 2015 అక్టోబర్ 31 న తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లిచేసుకుంది మధుప్రియ. ఈ పెళ్లి ఇష్టంలేని తల్లీదండ్రులు ఈ వివాహ వేడుకకు హజరుకాలేదు. పెళ్లి అయ్యి సరిగ్గా అయిదు నెలలు కూడా గడవకముందే మధుప్రియ తన భర్తపై పిర్యాదు చేయడం చర్చనీయాంశం అయ్యింది. అప్పట్లో వీరి వివాహం పట్ల పెద్ద చర్చే నడిచింది. తల్లీదండ్రులు సైతం ఈ పెళ్లి వద్దని మధుప్రియను వారించారు. అయినప్పటికీ పట్టువీడని మధుప్రియ శ్రీకాంత్ ను పెళ్లిచేసుకుంది. అప్పట్లోనే వీరి ప్రేమ వ్యవహారం అనేక ట్విస్ట్ లకు దారితీసింది. తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తపైనే వేధింపుల కేసు పెట్టడం మరో మారు చర్చనీయాంశం అయ్యింది.
Watch Video For More Info: