“శోభనం తర్వాత రోజే నన్ను కొట్టాడు”…భర్త గురించి అసలు నిజాలు బయటపెట్టిన తెలుగు టాప్ సింగర్!

సెలబ్రిటిస్ అంటే ఏ కష్టం లేని వారు,ఏది కావాలనుకున్న నిమిషాల్లో అరేంజ్ ఐపోతాయి.ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని అనుకుంటాం కాని..కష్టాలకు ఎవరూ అతీతులు కాదు..సామాన్యులైనా,సెలబ్రిటీలయినా..వారి జీవితాల్లో కూడా కష్టాలు కన్నీళ్లుంటాయి.ఇంటర్నెట్ ప్రపంచం వచ్చాక సెలబ్రిటిల గురించి ప్రతి విషయం ఓపెన్ అవుతుంది.కొన్నింటిని వారే అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ లో రివీల్ చేస్తున్నారు..ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సింగర్ కౌసల్య తన వైవాహిక జీవితం విఫలం అవడం గురించి పరిణామాలను చెప్పుకొచ్చింది.

నీకోసం సినిమాతో కెరీర్ ప్రారంభించిన కౌసల్య ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ మంచి గాయనిగా పేరు తెచ్చుకుంది..అయితే గాయనిగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి పీటలెక్కిన కౌసల్యకు వివాహ జీవితంలో తొలి రోజుల్లోనే కష్టాలను చవిచూసింది.ఇటీవల ఆమె ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న గృహహింసను వివరించింది.ఆమె భర్త  పెళ్లిలో తమకు మర్యాదలు సరిగ్గా చేయలేదని గొడవకు దిగగా, తన తల్లిని ఏమీ అనవద్దని అన్నందుకే శోభనం తర్వాత రోజే కొట్టాడని, ఆ దెబ్బ ప్రభావం ఏళ్లు గడిచినా తనపై ఇంకా ఉందని చెప్పింది. అప్పుడే చనిపోవాలని, విడాకులు తీసుకోవాలని అనుకున్నానని, అయితే, చిన్నతనంలోనే తండ్రి చనిపోగా, కష్టపడి పెంచిన తల్లి, పెళ్లి కావాల్సిన చెల్లెలు, సొసైటీ గురించిన ఆలోచన వచ్చి ఆగిపోయానని తెలిపింది.

ఆ తర్వాత బాబు పుట్టిన ఆరేళ్ల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉందని, ‘సూపర్ సింగర్ 7’ జరుగుతున్న వేళ, సమస్యను పరిష్కరించేందుకు తన బావ వచ్చినప్పుడు, వాళ్ల ముందు తనను రక్తం కారేలా కొట్టాడని, ఆ సమయంలో బాబు వచ్చి, “అమ్మను కొట్టొద్దు నాన్నా. ప్లీజ్‌ కొట్టొద్దు నాన్నా” అని వేడుకుంటుంటే అతని హృదయం కరగలేదని వివరించారు. అంతేకాదు అతనికి ఇంకో అమ్మాయితో సంబంధముందని, వారికో బిడ్డ కూడా ఉన్నాడని తెలిసి తట్టుకోలేకపోయానని కౌసల్య వెల్లడించింది. ప్రస్తుతం నేను,నాబిడ్డ తో కలిసి హాయిగా జీవితం గడుపుతున్నాను అని చెప్పుకొచ్చింది.

Comments

comments

Share this post

scroll to top