పాట అంటే ఇలా ఉండాలి బాస్? విన్నాక నిలబడి చప్పట్లు కొట్టాలనిపిస్తుంది.

పాట అంటే ఇలా ఉండాలి. గుండెల్లో గుచ్చుకునే లిరిక్స్ ఓ పక్క, అంతే వాడితో పాడుతున్న ఆమె ఓ పక్క. సాహిత్యానికి గాత్రానికి వాయిద్యానికి పోటీ అన్నట్టు సాగింది ఆ ఎనమిది నిమిషాల సమయం. ఆమె ఊపిరి పీల్చుకోకుండా పాడుతుంటే వినేవాళ్లంతా ఊపిిరిపట్టి మరీ విన్నారు..?పాట అంతా అయ్యాక బాలు,మనూ లాంటి  మహామహులు సైతం నిలబడిమరీ చప్పట్లు కొట్టారంటేనే తెలుస్తుంది ఆమె పాడిన విధానం… నిజంగా పాటకున్న శక్తిని చాలా దగ్గరినుండి చూసిన అనుభూతి కలిగింది ఈ పాట వింటుంటే మీరు ఓ సారి వినండి.

Watch Video Song:( Wait 3 Sec For Video To Load)

Lyrics For You:

నిత్యం ఏకాంత క్షణమే అడిగా
యుద్ధం లేనట్టి లోకం అడిగా
రక్తతరంగ ప్రవాహం అడిగా
ఉదయం లాంటి హృదయం అడిగా
అనుబంధాలకు ఆయుస్సడిగా
ఆనందాశ్రులకు ఆశ్శీస్సడిగా
మదినొప్పించని మాటను అడిగా
ఎదమెప్పించే యవ్వనమడిగా

నెమలి ఆటకు పదమే అడిగా
కోయిల పాటకు పల్లవి అడిగా
నదిలో గుక్కెడు నీళ్ళే అడిగా
మదిలో జానెడు చోటే అడిగా
మచ్చంటు లేని జాబిలినడిగా
నక్షత్రకాంతి నట్టింటడిగా
దుఃఖం వధించు అస్త్రం అడిగా
అస్త్రం ఫలించు యోగం అడిగా

చీకటి ఊడ్చే చీపురునడిగా
పూలకు నూరెళ్ళామని అడిగా
మానవజాతికి ఒక నీతడిగా
వెతలరాత్రికే వేకువనడిగా
ఒకటే వర్ణం సబబని అడిగా
ఒక అనురాగం ఒడిలో అడిగా
వాలని పొద్దున నెలవంకడిగా
ప్రాణముండగా స్వర్గం అడిగా

న్యాయం ధర్మం ఇలలో అడిగా
ఎద రగిలించే కవితే అడిగా
కన్నీరెరుగని కన్నే అడిగా
క్షామం నశించు కాలం అడిగా
చుక్కలు దాటే స్వతంత్రమడిగా
దిక్కులు దాటే విహంగమడిగా
తొలకరి మెరుపుల నిలకడనడిగా
ఎండమావిలో ఏరును అడిగా

మూగపాటకొక చరణం అడిగా
మౌనభాష వ్యాకరణం అడిగా
నమ్మిచెడని ఓ స్నేహం అడిగా
శాంతిని పెంచే సంపదనడిగా
వస్తే వెళ్ళని వసంతమడిగా
ఏడేడు జన్మాలకొక తోడడిగా
ఏనాడు వాడని చిరునవ్వడిగా
ముసిరే మంచుల ముత్యాలడిగా

ముసిముసినవ్వుల ముగ్గులు అడిగా
ఆశల మెరుపుల జగమే అడిగా
అంధకారమా పొమ్మని అడిగా
అందరి ఎదలో హరివిల్లడిగా
మరుగైపోని మమతను అడిగా
కరువైపోని సమతను అడిగా

రాయలంటి కవిరాజుని అడిగా
బమ్మెర పోతన భక్తిని అడిగా
భారతి మెచ్చిన తెలుగే అడిగా
పాశుపతాస్త్రం నరుడై అడిగా
మోహన క్రిష్ణుడి మురళే అడిగా
మధుర మీనాక్షి చిలకే అడిగా

వున్నది చెప్పే ధైర్యం అడిగా
ఒడ్డెక్కించే పందెం అడిగా
మల్లెలు పూసే వలపే అడిగా
మంచిని పెంచే మనసే అడిగా
పంజా విసిరే దమ్మే అడిగా
పిడుగుని పట్టే ఒడుపే అడిగా
ద్రోహం అణిచే సత్తానడిగా
చస్తే మిగిలే చరిత్రనడిగా
విధిని జయించే ఓరిమినడిగా
ఓరిమిలో ఒక కూరిమినడిగా
సహనానికి హద్దేదని అడిగా
దహనానికి అంతేదని అడిగా
కాలం వేగం కాళ్ళకు అడిగా
చిన్నా చితకా జగడాలడిగా
తియ్యగ ఉండే గాయం అడిగా
గాయానికి ఒక గేయం అడిగా
పొద్దే వాలని ప్రాయం అడిగా

ఒడిలో శిశువై చనుబాలడిగా
కంటికి రెప్పగ తల్లిని అడిగా
ఐదో ఏట బడినే అడిగా
ఆరో వేలుగ పెన్నే అడిగా
ఖరీదు కట్టని కరుణే అడిగా
ఎన్నని అడగను దొరకనివీ
ఎంతని అడగను జరగనివీ
ఎవ్వరినడగను నా గతిని
కళ్ళకు లక్ష్యం కలలంటూ
కాళ్ళకు గమ్యం కాడంటూ
భగవధ్గీత వాక్యం వింటూ
మరణం మరణం శరణం అడిగా

Watch Video Song:

 

Comments

comments

Share this post

scroll to top