యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్న బేబీ ‘మట్టి మనిషినండి నేను’ పాట, 3 రోజుల్లోనే రికార్డు వ్యూస్..!!

చిన్న పల్లెటూరు, పూట గడవాలి అంటే పని చెయ్యాల్సిందే, ఒక పాట.. ఒకే ఒక పాట, బేబీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఏ.ఆర్.రెహమాన్ నుండి మెగా స్టార్ చిరంజీవి వరకు ఆమెను అభినందించారు, మెగా స్టార్ చిరంజీవి స్వయంగా బేబీ ను ఆయన ఇంటికి ఆహ్వానించి ఆమె కు కొంత నగదు ఇచ్చి ఆమెకు అండగా నిలుస్తా అని హామీ ఇచ్చారు. సంగీత దర్శకుల్లో కోటి నుండి రఘు కుంచె వరకు అందరూ ఆమెకు అండగా నిలిచారు.

పల్లె కోయిల.. :

ఈ పల్లె కోయిల తో రఘు కుంచె గుండెలకు హత్తుకు పోయే పాట పాడించాడు, ఆ పాట ఇప్పుడు యూట్యూబ్ ని ఊపేస్తోంది, ‘మట్టి మనిషినండి నేను’ పాటకు యూట్యూబ్ లో బ్రహ్మాండమైన స్పందన వస్తుంది, విడుదల అయిన మూడు రోజుల్లోనే 1 మిలియన్ వ్యూస్ ధాటి సంచలనం సృష్టించింది, ఇప్పటి వరకు ఈ పాటకు దాదాపు 12 లక్షల వ్యూస్ వచ్చాయి, పాట వైరల్ అవ్వడం తో ఈ పాటకు కచ్చితంగా కోటి కి పైగా వ్యూస్ వస్తాయి.

అదృష్టమే కాదు, ప్రతిభ కూడా..:

చదువు రాకపోయినా, చరణాలు రాగాలు అలవాటు లేకపోయినా, జీవితంలో గరళాన్ని మింగి తన గొంతులోని అమృతాన్ని మన చెవుల్లో పోసిన ఒక పల్లె కోయిల పాడిన పాట అందరిని ఆకట్టుకుంటుంది అంటే, కేవలం అదృష్టమే కాదు, ఆమె ప్రతిభ అనే చెప్పాలి. పల్లె కోయిల అనే బిరుదు ఆమెకు అంకితం ఇచ్చారు జనాలు, యూట్యూబ్ లో దాదాపు 90 వేళ లైక్స్ వచ్చాయి ఈ సాంగ్ కి నాలుగు రోజుల్లో.

సినిమాల్లో కూడా.. :

ఈ పల్లె కోయిలమ్మ తో సినిమాల్లో కూడా పాటలు పాడియ్యాలని మ్యూజిక్ డైరెక్టర్స్ ఏ కాదు, దర్శక, నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో బేబీ ఒక పెద్ద సింగర్ అవుతుందని చాలా మంది అనుకుంటున్నారు, ఆమె ఇన్ని రోజులు పడిన కష్టానికి ఆమె గాత్రం సహాయం చేసిందని నెటిజన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

‘మట్టి మనిషినండి నేను’ లిరిక్స్/ సాహిత్యం..:

పల్లవి :
మట్టిమనిషినండి నేను..
మాణిక్యమన్నారు నన్ను.. !!2!!

పల్లెకోయిలమ్మ తెల్లవారి కూసే కూతే నా పాట..

పంటచేనులోన పైరుకంకి పైన గాలే నా తాళం..

ఏలేలో.. ఏలేలో..
నానవ్వే.. ఉయ్యాలో…

చరణం :
చెమటచుక్క చదువులు నాయి..
కాయాకష్టం పాఠాలు..

పయిటచెంగు దాచిన కంట్లో గురువే కన్నీళ్లు..

ఏతమేసి తోడానండీ నాలోఉన్న రాగాలు..

దేవుడింక చాలన్నాడు పెట్టిన కష్టాలు..

పచ్చపచ్ఛాని పైరమ్మ పాట..

ఏరువాకల్లో నాఎంకిపాట..

ముళ్లదారే తీసి, పూలేఏసి మీముందు ఉoచాయీ పుట..

ఇది నాబతుకు పాట..

తీపిరాగాల తోటి, మావూరు దాటి మీకోసమొచ్చాను..

Watch Video:

Comments

comments

Share this post

scroll to top