సింగరేణి హైస్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ లలో పోస్టులు-వాటి వివరాలు.

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  సింగరేణి పరిధిలోని మహిళా డిగ్రీ, జూనియర్, హైస్కూల్, పాలిటెక్నిక్ కాలేజీలోని ఖాళీలను  కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 30. సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ కోల్‌బెల్ట్ పరిధిలో నివసిస్తున్న ఉద్యోగులు, ప్రాంతవాసుల కోసం 1975 నుంచి విద్యాసంస్థలను నిర్వహిస్తుంది.

 1. సింగరేణి కాలరీస్ హైస్కూల్స్
  2016 – 17 విద్యాసంవత్సరానికి గాను కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
  ఈ పోస్టులు కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భూపాలపల్లి, గోదావరిఖని, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లిలలో ఉన్నాయి.
  టీచర్స్ (ఇంగ్లిష్, తెలుగు మీడియంల్లో బోధించే వారు)
  ఖాళీల సంఖ్య – 32
  అర్హతలు: బీఎస్సీ ఎంపీసీ/బైపీసీతోపాటు బీఎడ్‌లో మ్యాథ్స్, ఫిజికల్‌సైన్స్ లేదా బయాలజిలక్ సైన్సెస్ మెథడాలజీగా కలిగి ఉండాలి. లేదా డిగ్రీలో ఇంగ్లిష్ ప్రధాన సబ్జెక్టుగా కలిగి ఉండాలి లేదా పీజీలో ఇంగ్లిష్, బీఎడ్‌లో ఇంగ్లిష్/సోషల్ స్టడీస్ మెథడాలజీగా కలిగి ఉండాలి. లేదా ఆర్ట్స్ డిగ్రీ, బీఎడ్‌లో సోషల్ స్టడీస్ ఒక మెథడాలజీగా ఉండాలి.
  జీతం: నెలకు రూ. 10,900/- (కన్సాలిడేటెడ్ పే):

2) తెలుగు పండిట్స్ – 6 ఖాళీలు.
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీలో తెలుగు ప్రధాన సబ్జెక్టుగా (ఆప్షనల్స్‌లో ఒకటి) లేదా డిగ్రీ ఓరియంటల్ లాంగ్వేజ్ ఇన్ తెలుగు, పీజీ తెలుగుతోపాటు బీఎడ్‌లో తెలుగు ఒక మెథడాలజీగా కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ. 10,900/-

3) హిందీ పండిట్స్ – 4 ఖాళీలు:
అర్హతలు: డిగ్రీలో హిందీ ఒక ప్రధాన సబ్జెక్టుగా కలిగి ఉండాలి. లేదా బీవోఎల్ లేదా దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ వారి ప్రవీణ లేదా హిందీ ప్రచార సభ వారి విద్వాన్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. పీజీ హిందీతోపాటు బీఎడ్‌లో హిందీ మెథడాలజీగా కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ. 10,900/
4) జూనియర్ అసిస్టెంట్ – 9 ఖాళీలు
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
జీతం: నెలకు రూ. 8,400/-
5) క్లాస్ 4 పోస్టులు – 7 ఖాళీలు
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత.
జీతం: నెలకు రూ. 6,700/-
జోన్ 5 అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. జోన్ 5 కిందికి వచ్చే జిల్లాలు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్.

6) మహిళా డిగ్రీ కాలేజ్‌లో
కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ మహిళా డిగ్రీ, జూనియర్ కాలేజీలో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: ఈ ఖాళీలను జోన్ 5 అభ్యర్థులతో కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.

మహిళా డిగ్రీ కాలేజీలో…
లెక్చరర్ (కెమిస్ట్రీ) – 3 ఖాళీలు
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
లెక్చరర్ (కామర్స్) – 1 ఖాళీ
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఎంకాం ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలకు మార్కుల్లో 5 శాతం సడలింపు ఉంటుంది.
జీతం: పై రెండు పోస్టులకు నెలకు రూ. 20,700/-

Singareni Collieries Recruitment 2015 todaynaukri
ఆఫీస్ సూపరింటెండెంట్ – 1 ఖాళీ
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
జీతం: నెలకు రూ. 14, 680/-
జూనియర్ అసిస్టెంట్ (పురుష, మహిళ అభ్యర్థులు) – 5 ఖాళీలు
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.
జీతం: నెలకు రూ. 8,400/-
అటెండెంట్ (పురుషులు మాత్రమే) – 1 ఖాళీ
అర్హత – పదోతరగతి ఉత్తీర్ణత.
జీతం: నెలకు రూ. 6,700/-

మహిళా జూనియర్ కాలేజీలో….
జూనియర్ అసిస్టెంట్ – 2 ఖాళీలు
పురుష, మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉండాలి.
జీతం: నెలకు రూ. 8,400/-
అటెండెంట్ (మహిళ అభ్యర్థులు మాత్రమే) – 2 ఖాళీలు
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత.
జీతం: నెలకు రూ. 6,700/-
నోట్: పై పోస్టులన్నింటికి లోకల్ (జోన్ 5) అభ్యర్థులు మాత్రమే అర్హులు.

పాలిటెక్నిక్ కాలేజీలో
శ్రీరాంపూర్‌లోని సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కాలేజీలో కింది ఖాళీలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు: ఈ పోస్టులకు జోన్ 5, జోన్ 6 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

లెక్చరర్ పోస్టులు కింది విభాగాల్లో…
సివిల్ ఇంజినీరింగ్ – 1
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ బ్రాంచీ – 1
మైనింగ్ ఇంజినీరింగ్ – 1 ఖాళీ ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత బ్రాంచీలో ఫస్ట్‌క్లాస్‌లో ఇంజినీరింగ్ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలకు ఐదు శాతం మార్కులు సడలింపు ఇస్తారు.
జీతం: నెలకు రూ. 19,000/-
జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ – 1 ఖాళీ
మైనింగ్ ఇంజినీరింగ్ బ్రాంచీలో ఈ పోస్టు ఉంది.
అర్హతలు: డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజినీరింగ్ లేదా ఓవర్‌మ్యాన్/మైనింగ్ సిర్దార్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ. 7,700/- (డిప్లొమా వారికి), రూ. 7,000/- సర్టిఫికెట్ హోల్డర్స్‌కు.
జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ – 1 ఖాళీ
ఈ ఖాళీ మెకానికల్ వర్క్‌షాప్‌లో ఉంది.
అర్హత: ఐటీఐ (వెల్డర్)
జీతం: నెలకు రూ. 7,000/-
జూనియర్ అసిస్టెంట్ – 2 ఖాళీలు
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
జీతం: నెలకు రూ. 8,400/-
నోట్: జోన్ 5, 6 అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలకు Office: 08736-200620 Principal:
9491144076; OS: 9866139491 నంబర్లలో సంప్రదించవచ్చు.

పై అన్ని పోస్టులకు
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
చివరితేదీ: జూన్ 30
వెబ్‌సైట్: www.scclmines.com / http://www.scclmines.com

సహాకారం( స్వేన కలం)

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top